AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ పీసీసీ చీఫ్ రేసులో ఆ ఇద్దరు…?

తెలంగాణలో పీసీసీకి కొత్త సారథి ఎవరిని పెట్టాలనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట హైకమాండ్ పెద్దలు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతోనే మార్పు చేయాలనే ఆలోచన చేశారట. అయితే కొంత టైం తీసుకుందాం అనేలోపే ఇటు రాహుల్ రాజీనామాతో తెలంగాణలో పీసీసీ కీలక నేతలంతా తమ పదవులకు రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పీసీసీ నేతలంతా రాజీనామాలు చేశారు. ఇదే అదునుగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారట […]

టీ పీసీసీ చీఫ్ రేసులో ఆ ఇద్దరు...?
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 01, 2019 | 9:20 PM

Share

తెలంగాణలో పీసీసీకి కొత్త సారథి ఎవరిని పెట్టాలనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట హైకమాండ్ పెద్దలు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతోనే మార్పు చేయాలనే ఆలోచన చేశారట. అయితే కొంత టైం తీసుకుందాం అనేలోపే ఇటు రాహుల్ రాజీనామాతో తెలంగాణలో పీసీసీ కీలక నేతలంతా తమ పదవులకు రాజీనామా చేశారు.

దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పీసీసీ నేతలంతా రాజీనామాలు చేశారు. ఇదే అదునుగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారట ఢిల్లీ హస్తం నేతలు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నారట పీసీసీ నేతలు.

ఇటు ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలంతా పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి మాటకారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని..అదే టైంలో గులాబీ నేతలకు ధీటుగా నిలపడతారనే మాటను హై కమాండ్ కు చెబుతున్నారట రేవంత్ వర్గం నేతలు.

మరో వైపు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే పనిలో బిజీ అయ్యారట సీనియర్ నేతలు. తమను నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ కు పార్టీలో పెద్ద పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు ఓటుకు నోటు కేసు విషయాన్ని గుర్తు చేస్తూ హై కమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లే పనిలో బిజీగా ఉన్నారట.

అయితే హైకమాండ్ నేతలు మాత్రం…బలమైన నేతకే పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు