‘రఫేల్‌’పై రాహుల్‌ విమర్శల పర్వం

ఢిల్లీ: గత కొంతకాలంగా అధికారపక్షంపై దాడి చేయడానికి ప్రతిపక్షం అధినేత రాహుల్ ఎంచుకున్న ప్రధాన అస్త్రం రపేల్ ఒప్పందం. ఈ విషయమై ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి తన విమర్శల తీవ్రతను పెంచారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం నిన్న సుప్రీంకోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘పత్రాలు చోరీ అయ్యాయని ప్రభుత్వం చెప్పిందంటే అందులోని సమాచారం నిజమైనదేనని స్పష్టమవుతోంది. అంటే ఒప్పందంలో అవినీతి జరిగిందని […]

‘రఫేల్‌’పై రాహుల్‌ విమర్శల పర్వం
Ram Naramaneni

|

Mar 07, 2019 | 4:00 PM

ఢిల్లీ: గత కొంతకాలంగా అధికారపక్షంపై దాడి చేయడానికి ప్రతిపక్షం అధినేత రాహుల్ ఎంచుకున్న ప్రధాన అస్త్రం రపేల్ ఒప్పందం. ఈ విషయమై ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి తన విమర్శల తీవ్రతను పెంచారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం నిన్న సుప్రీంకోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘పత్రాలు చోరీ అయ్యాయని ప్రభుత్వం చెప్పిందంటే అందులోని సమాచారం నిజమైనదేనని స్పష్టమవుతోంది. అంటే ఒప్పందంలో అవినీతి జరిగిందని రుజువైంది’ అని కేంద్రాన్ని దుయ్యబట్టారు.

రఫేల్ అంశంపై తాజాగా రాహుల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రఫేల్‌ పత్రాలు కన్పించకుండా పోయాయి. అంటే అందులోని సమాచారం నిజమేనని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే రఫేల్‌ ఒప్పందంలో మోదీ జోక్యం ఉంది. ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపారనేది రుజువైంది. పత్రాల చోరీపై దర్యాప్తు జరుపుతామని కేంద్రం చెబుతోంది. కానీ రూ. 30వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తిపై(మోదీని ఉద్దేశిస్తూ) మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదు. రఫేల్‌ ఒప్పందానికి మోదీ బైపాస్‌ సర్జరీ చేశారు. అనిల్‌ అంబానీకి ప్రయోజనం చేకూర్చేందుకే కొనుగోలును ఆలస్యం చేశారు. అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలి. ప్రధానిని కూడా విచారించాలి’ అని రాహుల్‌ అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu