వ్యాక్సిన్ల కొనుగోలులో జాప్యం….ఇప్పటికైనా మేల్కొనాలంటున్న ప్రముఖ వైరాలజిస్ట్, థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని సూచన

ఇతర దేశాల మాదిరిగా ఇండియా వ్యాక్సిన్ల కొనుగొలుకు చొరవ చూపకుండా జాప్యం చేసిందని ప్రముఖ వైరాలజిస్ట్ ఒకరు అంటున్నారు.

వ్యాక్సిన్ల కొనుగోలులో జాప్యం....ఇప్పటికైనా మేల్కొనాలంటున్న ప్రముఖ వైరాలజిస్ట్,  థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని సూచన
India Late The Table Buying
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 24, 2021 | 10:03 AM

ఇతర దేశాల మాదిరిగా ఇండియా వ్యాక్సిన్ల కొనుగొలుకు చొరవ చూపకుండా జాప్యం చేసిందని ప్రముఖ వైరాలజిస్ట్ ఒకరు అంటున్నారు. అమెరికా వంటి దేశాలు గత మార్చి నెలలోనే టీకామందులను సిధ్దం చేసుకున్నాయని, సకాలంలో వాటిని వాడాయని మెడికల్ ఆక్సిజన్ పై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యురాలు గగన్ దీప్ కాంగ్ వెల్లడించారు. రాయల్ సొసైటీ సభ్యురాలైన తొలి మహిళగా పాపులర్ అయిన ఈమె.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మనకు అవసరమైనన్ని టీకామందులు లేవని తెలిపారు. చాలా దేశాలు ఈ ఏడాదికి సరిపడా వ్యాక్సిన్ నిల్వలను ఉంచుకున్నాయని, ఇప్పుడు ఆ వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తామంటూ ఆ దేశాల వెంటబడడంలో ఔచిత్యం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు మోడెర్నా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం గతంలోనే ఆ కంపెనీతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందని, ఈ సంవత్సరాంతానికి తాము ఈ టీకామందును సప్లయ్ చేయగలుగుతామని ఆ కంపెనీ చెప్పిందని ఆమె అన్నారు. మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్తామని చేస్తున్న ప్రకటనల సమయంలో ఈ వైరాలజిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జైడస్, కాడిలా, బయలాజికల్ ఈ వంటి సంస్థలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని, ఇవి మరి కొన్ని నెలల్లో సిద్ధమవుతాయని ఆమె చెప్పారు. వీటి ట్రయల్స్ సక్సెస్ అయిన పక్షంలో ఇప్పటినుంచే ప్రభుత్వం వీటి ప్రొక్యూర్ మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాలని ఆమె అన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలులో ఇండియా అనుసరిస్తున్న పాలసీలో కొన్ని మార్పులు అవసరమని పేర్కొన్నారు.

అమెరికా గత మార్చ్ నెలలోనే వ్యాక్సిన్ల కోసం 10 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిందని గగన్ దీప్ కాంగ్ తెలిపారు. ఆ దేశం టీకామందుల కోసం అడ్వాన్స్ బల్క్ ఆర్డర్స్ పెట్టకుండా ఇందుకు బదులు ప్రయారిటీ గ్రూపులకు అవసరమైన చిన్నపాటి కొనుగోళ్లు చేసిందన్నారు. ఏమైనా మనం థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని, ముఖ్యంగా ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కంపు కొట్టే పువ్వు.. అయినా చూసేందుకు ఎగబడుతున్న జనం..!! ( వీడియో )

AP Inter Exams: ఏపీలో ఇంటర్, ప్రవేశ పరీక్షల నిర్వహణ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..