బీజేపీ ఎమ్మెల్యే రామ్ రతన్ వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రామ్ రతన్ కుష్వాహా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులెవరైనా బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గాని, భయభ్రాంతులకు గురిచేస్తే వారిని షూలతో కొట్టాలని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ అధికారులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల లోపు ప్రభుత్వ అధికారులు గనుక అభివృద్ధి పనులను చేపట్టకపోతే, అలాగే కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే వారిని షూలతో కొట్టాలని అన్నారు. ఎందుకంటే ఓపికకు కూడా ఓ హద్దు ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో […]
బీజేపీ ఎమ్మెల్యే రామ్ రతన్ కుష్వాహా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులెవరైనా బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గాని, భయభ్రాంతులకు గురిచేస్తే వారిని షూలతో కొట్టాలని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ అధికారులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల లోపు ప్రభుత్వ అధికారులు గనుక అభివృద్ధి పనులను చేపట్టకపోతే, అలాగే కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే వారిని షూలతో కొట్టాలని అన్నారు. ఎందుకంటే ఓపికకు కూడా ఓ హద్దు ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎస్పీ, బీఎస్పీ పార్టీలతో అంటకాగిన అధికారులతో కూడా జాగ్రత్తగా మసులు కోవాలని కుష్వాహా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.