అంతా మిస్టరీ.. బెంగాల్‌లో బీజేపీ ‘హత్యా రాజకీయాలు’ ?
పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసి కార్యకర్తల చేతిలో 54 మంది బీజేపీ కార్యకర్తలు హతులయ్యారని, వారి కుటుంబాలను ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని కమలనాథులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ కుటుంబాల్లో కొంతమందిని అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పరామర్శించారు కూడా. తమ పార్టీ కార్యకర్తల పట్ల తామెంత ఆదరణ పూర్వకంగా ఉంటామో, వారిని ఎలా ఆదుకుంటామో దేశానికి చాటాలనే పార్టీ అధినాయకత్వం ఈ వ్యూహానికి తెర తీసింది. అయితే 54 కేసుల్లో […]
పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసి కార్యకర్తల చేతిలో 54 మంది బీజేపీ కార్యకర్తలు హతులయ్యారని, వారి కుటుంబాలను ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని కమలనాథులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ కుటుంబాల్లో కొంతమందిని అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పరామర్శించారు కూడా. తమ పార్టీ కార్యకర్తల పట్ల తామెంత ఆదరణ పూర్వకంగా ఉంటామో, వారిని ఎలా ఆదుకుంటామో దేశానికి చాటాలనే పార్టీ అధినాయకత్వం ఈ వ్యూహానికి తెర తీసింది. అయితే 54 కేసుల్లో అసలైన కేసులు ఇరవై మూడని, , కనీసం ఏడు పూర్తి ఫేక్ అని తేలింది. వివిధ సంఘటనల్లో మరణించిన వారినో, జబ్బు పడి ప్రాణాలు వదిలినవారినో, లేదా యాక్సిడెంట్లలో చనిపోయినవారినో బీజేపీ కార్యకర్తలుగా ముద్ర వేసి… లిస్టు తయారు చేసి ఢిల్లీకి పంపినట్టు తేలింది. ఓ కేసులో పోలీసులు ఓ నిందితుడ్ని ఛేజ్ చేస్తుండగా అతడు పారిపోతూ ప్రమాదం బారిన పడితే అతని చేతిలో బీజేపీ పతాకాన్ని ఉంచారని., అతడు మరణించాక అతడే తమ కార్యకర్త అని స్థానిక బీజేపీ నేతలు పేర్కొన్నారని, ఈ ‘ హత్య ‘ కు కారణం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలేనని వారు పార్టీ అధిష్టానానికి తెలిపారని సమాచారం. ఇంకా ఇలాంటివే ఎన్నో కేసులున్న విషయం బయటపడింది. తమ పార్టీ శ్రేణులెవరూ హత్యా రాజకీయాలకు పాల్పడలేదని సిఎం దీదీ కూడా ఖండించిన విషయం గమనార్హం. ఇలాంటి బీజేపీ కుయుక్తులకు తాము బెదిరేది లేదని ఆమె అప్పుడే స్పష్టం చేశారు.