కోరలు చాస్తున్న కోవిడ్, అన్ని ఎన్నికల ర్యాలీలను నిలిపివేస్తున్నా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ ప్రబలమవుతుండడంతో తన ఎన్నికల ర్యాలీలనన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ముఖ్యంగా అయిదు దశల తరువాత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు దశల్లో జరగనున్నాయి.
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ ప్రబలమవుతుండడంతో తన ఎన్నికల ర్యాలీలనన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ముఖ్యంగా అయిదు దశల తరువాత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు దశల్లో జరగనున్నాయి. ఈ నేసథ్యంలో…. కోవిడ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న దృష్ట్యా.. ఇక తన ప్రచార సభలను విరమించుకుంటున్నట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇతర రాజకీయ నాయకులు కూడా తనలాగే నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికల ర్యాలీలకు జనాలు పోటెత్తుతున్నారు. వివిధ జిల్లాల్లో ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ నేతలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలకు, రోడ్ షోలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు తాజాగా రెండు లక్షల 61 వేలకు పైగా నమోదయ్యాయి. ఢిల్లీ సహా సుమారు 18 రాష్ట్రాల్లో అనూహ్యంగా ఈ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి.
గత నాలుగు రోజులుగా ఈ కేసులు తామరతంపరగా పెరిగిపోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుధ్ధ ప్రాతిపదికన చేపడుతున్నప్పటికీ, ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ వంటి చర్యలకు తప్పనిసరిగా దిగుతున్నాయి. కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కాగా- వ్యాక్సిన్లను అత్యవసరంగా సరఫరా చేయాలనీ ఏపీ సహా పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కోట్ల డోసులు అవసరం కాగా కేవలం కొన్ని లక్షల డోసులు కేంద్రం పంపుతున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడంలేదు. ఈ పరిస్థితుల్లో జనాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఎన్నికల ర్యాలీల్లో ఈ మహమ్మారి మరింతగా పేట్రేగిపోవచ్చునని, అందువల్ల తన ప్రచార సభలను వాయిదా వేసుకుంటున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఇతర పొలిటికల్ లీడర్లు కూడా తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.
In view of the Covid situation, I am suspending all my public rallies in West Bengal.
I would advise all political leaders to think deeply about the consequences of holding large public rallies under the current circumstances.
— Rahul Gandhi (@RahulGandhi) April 18, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Road Accident: అస్థికలను గంగలో కలిపేందుకు వెళుతుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Actress Sameera Reddy : సోనూసూద్, అర్జున్ రాంపాల్.. తాజాగా సినీనటి సమీరారెడ్డికి కరోనా పాజిటివ్