హుజుర్‌నగర్ ఉప ఎన్నిక: టీడీపీ అభ్యర్థి ఫిక్స్..రేస్‌లోకి వైసీపీ?

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తుంటే మధ్యలో బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపై కన్నేశాయి.  తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. చావా కిరణ్మయిని టీడీపీ తరుపున ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. కిరణ్మయికి బీఫామ్ అందించారు. హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ప్రధాన […]

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక: టీడీపీ అభ్యర్థి ఫిక్స్..రేస్‌లోకి వైసీపీ?
Follow us

|

Updated on: Sep 29, 2019 | 6:19 PM

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తుంటే మధ్యలో బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపై కన్నేశాయి.  తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. చావా కిరణ్మయిని టీడీపీ తరుపున ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. కిరణ్మయికి బీఫామ్ అందించారు.

హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు: 

కాంగ్రెస్   :      ఉత్తమ్ పద్మావతి

టీఆర్ఎస్ :     శానంపూడి సైదిరెడ్డి( సీపీఐ మద్దతు కూడా లభించే అవకాశం ఉంది)

బీజేపీ       :      కోట రామారావు

టీడీపీ       :      చావా కిరణ్మయి

సీపీఎం   :      పారేపల్లి శేఖర్

వైఎస్సార్‌సీపీ కూడా రంగంలోకి దిగనుందా?

టీడీపీ తమ అభ్యర్థిన ప్రకటించిన నేపథ్యంలో..వైసీపీ కూడా తమ రంగంలోకి దిగబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ ఇంతవరకూ తెలంగాణలో పార్టీ నిర్మాణం విషయంలో ఫోకస్ చెయ్యలేదు. ముందుగా ఏపీపై ఫోకస్ పెట్టి బంఫర్ మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఆంధ్రాకు బోర్డర్‌లో ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలలో జగన్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక హుజుర్‌నగర్‌లో జగన్‌కు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గ ఓటింగ్ బలంగా ఉంది. వారంతా మొదట్నుంచి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించేవారు. ఇప్పుడు జగన్ కనుక అక్కడ అభ్యర్థిని నిలబెడితే..ఎంతో కొంత ఆ కమ్యునిటీ ఓటింగ్‌ను చీల్చే అవకాశం ఉంది. అందునా వైసీపీ పార్టీకి ఫేస్ అయిన మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డి చరిష్మా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో తమ బలాన్ని చూపించడంతో పాటు..అటు కాంగ్రెస్‌కు చెక్ పెట్టి.. మిత్రుడైన సీఎం కేసీఆర్‌‌కు హెల్ప్ చేసే అవకాశం వైసీపీకి ఉంటుంది. దీంతో హుజూర్ నగర్ ఎన్నికలో  ఇక్కడ అభ్యర్థిని నిలపాలా వద్దా అన్న జగన్ నిర్ణయం ఫలితాన్ని ప్రభావితం చేయనుందని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.