మీరు కాపలాదారు… నేను నిరుద్యోగి.. ప్రధాని మోదీకి హార్దిక్ పటేల్ పంచ్
గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొడుతూ గుజరాత్ నుంచీ దూసుకొస్తున్న యువ కెరటం హార్దిక్ పటేల్ చౌకీదార్ హ్యాష్‌ట్యాగ్‌పై తనదైన శైలిలో స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా తమ ట్విట్టర్ అకౌంట్లలో తమ పేర్ల ముందు చౌకీదార్ పేరును పెట్టుకుంటున్నారు. తద్వారా తామంతా స్వచ్ఛమైన కాపలాదారులమనీ, నిజాయితీతో అవినీతికి తావులేని పాలన అందిస్తున్నామనే సంకేతాలు పంపుతున్నారు. దీనిపై గుజరాత్ రాష్ట్రానికే చెందిన కాంగ్రెస్ యువనేత, పాటీదార్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ […]

గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొడుతూ గుజరాత్ నుంచీ దూసుకొస్తున్న యువ కెరటం హార్దిక్ పటేల్ చౌకీదార్ హ్యాష్‌ట్యాగ్‌పై తనదైన శైలిలో స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా తమ ట్విట్టర్ అకౌంట్లలో తమ పేర్ల ముందు చౌకీదార్ పేరును పెట్టుకుంటున్నారు. తద్వారా తామంతా స్వచ్ఛమైన కాపలాదారులమనీ, నిజాయితీతో అవినీతికి తావులేని పాలన అందిస్తున్నామనే సంకేతాలు పంపుతున్నారు. దీనిపై గుజరాత్ రాష్ట్రానికే చెందిన కాంగ్రెస్ యువనేత, పాటీదార్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్ తనదైన రీతిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్‌లో తన అకౌంట్ పేరును బేరోజ్‌గార్ (నిరుద్యోగి) హార్దిక్ పటేల్ అని మార్చుకున్నారు. తద్వారా మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెరిగిందనీ, ఆ బాధితుల్లో తానూ ఉన్నానంటూ సెటైరికల్ పంచ్ వేశారు హార్దిక్ పటేల్.




