AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చెన్నాయుడిపై కేసు నమోదు..జగన్‌పై బాబు తీవ్ర విమర్శలు

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌‌లో ఆయనపై కేసు నమోదు అయింది. ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు.  దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్ద ఉన్న బాబు ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విధుల్లో ఉన్న పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బందోబస్తు విధుల […]

అచ్చెన్నాయుడిపై కేసు నమోదు..జగన్‌పై బాబు తీవ్ర విమర్శలు
Chandrababu Slams Jagan
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2019 | 3:12 AM

Share

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌‌లో ఆయనపై కేసు నమోదు అయింది. ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు.  దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్ద ఉన్న బాబు ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విధుల్లో ఉన్న పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బందోబస్తు విధుల నిర్వహణలో భాగంగా అమరావతి కరకట్టపై విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సదారి, కోటయ్య పట్ల అనుచిత ప్రవర్తన, దుర్భాషలాడారంటూ కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30, అమలులో ఉన్నప్పటికీ చట్టం ఉల్లంఘన, విధుల నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు.

జగన్‌పై బాబు తీవ్ర విమర్శలు:

ముఖ్యమంత్రి జగన్​పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో సీఎంలకు ఫాక్షన్ నేపథ్యం ఉన్నా.. ఆ గొడవలను వారి జిల్లాలకే పరిమితం చేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి… పరిటాల రవీంద్ర అంశంలో జోక్యం చేసుకున్నా.. అవి సీమకే పరిమితం అయ్యాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఫాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారని ఆరోపించారు.

లక్ష కోట్ల అవినీతి అభియోగాలున్న వ్యక్తే అవినీతి లేకుండా చేస్తానని చెప్పుకోవటం హాస్యాస్పదమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశాన్ని బాగు చేయాలని తనను దేవుడే పంపించాడంటూ జగన్ చెబుతున్న మాటలు వినాల్సి రావడం రాష్ట్రప్రజల దౌర్భగ్యామన్నారు. కోర్టులకు హాజరు కాకుండా మినహాయింపులు కోరే వ్యక్తి నోట నీతి వాక్యాలు వినాల్సి వస్తుందని మండిపడ్డారు.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తితే.. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని చంద్రబాబు నిలదీశారు. సీఎంకు రాష్ట్ర శాంతి భద్రతలు పట్టవని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగేలా… నిందితులపై ఎందుకు చర్యలకు తీసుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనీసం స్పందించకపోవటం గర్హనీయమని ఆక్షేపించారు.

పీపీఏలపై కేంద్రం, కోర్టులు, విదేశాలు.. రాష్ట్రప్రభుత్వ తీరును తప్పుబడుతున్నా.. సీఎం స్పందించకపోవటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతితో పాటు ఏ ఒక్క అంశంపైనైనా.. సీఎం స్పందించరా అని నిలదీశారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చలో ఆత్మకూరు నిరసనల్లో 7,165 మంది టీడీపీ నాయకులు పాల్గొన్నారని నేతలు చంద్రబాబుకు తెలిపారు. వారిలో 1,780 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని, 75మందిని గృహనిర్బంధం, 32మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్లు నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.