విశాఖ టీడీపీలో ముసలం…అధినేతకు ఇదొక టెన్షన్!

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడిన టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల తోనూ తలనొప్పి తయారైంది. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీని వీడుతుండగా…మరికొందరు పార్టీలో ఉంటూనే అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామలే పార్టీకి ఇబ్బందిగా ఉన్నాయనుకుంటే…వైసీపీ ప్రభుత్వం టీడీపీని అన్నివైపుల నుంచి టార్గెట్ చేస్తూ […]

విశాఖ టీడీపీలో ముసలం...అధినేతకు ఇదొక టెన్షన్!
Internal Clashes between TDP Leaders in Visakha
Follow us

|

Updated on: Sep 13, 2019 | 5:17 AM

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడిన టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల తోనూ తలనొప్పి తయారైంది. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు పార్టీని వీడుతుండగా…మరికొందరు పార్టీలో ఉంటూనే అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామలే పార్టీకి ఇబ్బందిగా ఉన్నాయనుకుంటే…వైసీపీ ప్రభుత్వం టీడీపీని అన్నివైపుల నుంచి టార్గెట్ చేస్తూ ముప్పుతిప్పలు పెడుతోంది. ఇలాంటి తరుణంలో కలిసికట్టుగా పని చేసి వైసీపీని ఎదురుకోవాల్సిన నేతలు ఒకరికి ఒకరు సాయం చేసుకోకుండా..విమర్శలు చేసుకుంటూ అధినేతకు  ఇబ్బందులు తప్పట్లేదు.

విశాఖపట్నంలో టిడిపి క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. వీరి మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకరికి ఒకరు మద్దతివ్వకుండా, ఎవరికి వారు స్వతంత్రంగా పని చేసుకుంటూ పోతున్నారు. ఇక ప్రెస్ మీట్లు పెట్టినా , ఏ కార్యక్రమం చేసినా ఎవరికి వారే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జిల్లా మంత్రులుగా పనిచేసిన నాయకులు సైతం ప్రస్తుతం పెద్దగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి సారించడం లేదు. అధికారపార్టీ ఒత్తిడితో, తమకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని సైలెంట్ గా చూస్తున్నారు.

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, విశాఖ అర్బన్ అధ్యక్షుడు ఎస్‌ఏ రెహమాన్ కు అసలు పడటం లేదు. వీరి మధ్య అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెహమాన్ చేసే ఏ కార్యక్రమానికి గణేశ్ సహకారం అందించడం లేదు. పైగా పార్టీ ఆఫీసుకు కూడా గణేశ్ రావడం లేదు. దీంతో ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన నారా లోకేశ్ కు రెహమాన్ ఫిర్యాదు చేశారు. తనకు గణేశ్ ఏ మాత్రం సహకరించడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వాసుపల్లికి.. రెహమాన్ ఓ లేఖాస్త్రం సంధించారు. గతంలో అర్బన్ అధ్యక్షుడుగా పని చేసిన వాసుపల్లి కనీసం పార్టీ నియమ నిబంధనలని తెలుసుకుని ఉండాలని, తాను అర్బన్ అధ్యక్షుడుగా ప్రమాణం చేసేటప్పుడు కూడా వాసుపల్లి రాలేదని పేర్కొన్నాడు. అలాగే విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని, లేకుంటే హైకమాండ్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాల్సి వస్తుందని లేఖలో రెహమాన్ వాసుపల్లిని హెచ్చరించారు.

ఇక విశాఖ జిల్లా రాజకీయాల్లో ఈ లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రెహమాన్ రాసిన లేఖకు గణేశ్ ఎలాంటి సమాధానమిస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న గ‌ణేశ్‌ను త‌ప్పించి రెహమాన్‌కు ప‌గ్గాలు ఇవ్వ‌డం గ‌ణేశ్‌కు న‌చ్చ‌లేదు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. ఇక సీనియ‌ర్ నేత‌లు వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, గంటా శ్రీనివాస‌రావు, స‌బ్బం హ‌రి ఇలా ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీళ్ళే కాదు విశాఖలో కొందరు సీనియర్ నేతలు కూడా కలిసికట్టుగా పని చేయకుండా పార్టీకి నష్టం వచ్చేలా చేస్తున్నారని టాక్ ఉంది. ఎవరి కార్యక్రమం వారు చేసుకుంటూ పార్టీ బలోపేతానికి గానీ, వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి కృషి చేయట్లేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా లోకేశ్ ప్రస్తుతం ఈ ఇష్యూని సాల్వ్ చేసే పనిలో  బిజిగా ఉన్నారు. మరి ఆయన చొరవతో ఈ అంతర్గత కుమ్ములాటలు శాంతిస్తాయా?. లెట్స్ వెయిట్ అండ్ సీ.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..