AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోట.. ఫ్యాన్ కింద సేదతీరబోతున్నారోచ్!

ఏపీలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీకి వరుస దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడగా… ఇప్పుడు మరో ముగ్గురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారని టాక్ నడుస్తోంది. ముందుగా ఊహించినట్టుగానే.. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.  ఆయన ఈ నెల 18న […]

తోట.. ఫ్యాన్ కింద సేదతీరబోతున్నారోచ్!
Tdp mla thota trimurthulu skip chandrababu meeting may join ysrcp soon
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2019 | 5:59 AM

Share

ఏపీలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీకి వరుస దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడగా… ఇప్పుడు మరో ముగ్గురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారని టాక్ నడుస్తోంది. ముందుగా ఊహించినట్టుగానే.. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.  ఆయన ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. త్రిమూర్తులతో పాటుగా టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని పైన సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు నుండి తోట త్రిమూర్తులు టీడీపీ అధినాయకత్వం మీద అసహనంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత త్రిమూర్తులు సారధ్యంలో కాకినాడలో టీడీపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఆ సమయంలో త్రిమూర్తులు పార్టీ మారుతారని భావించారు. అయితే అప్పుడు కేవలం ఎన్నికల తదనంతర పరిస్థితులపై చర్చించేందుకే ఈ భేటీ జరిగిందని చెప్పిన తోట… ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటనకు వెళ్లిన సమయంలోనూ త్రిమూర్తులు దూరంగానే ఉన్నారు. ఇక..ఈ నెల 13న త్రిమూర్తులు తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో తాను టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్లనున్న విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు సైతం వైసీపీలో చేరటానికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది.

ఈ ముగ్గురు పార్టీని వీడితే… రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలక జిల్లాగా పరిగణిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ ఖాయమన్న వాదన వినిపిస్తోంది.  టీడీపీలో కీలక నేతగానే కాకుండా కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న తోట త్రిమూర్తులు పార్టీ మారితే ఆ లోటు తీర్చలేనిదనే చెప్పాలి.

ఎన్నికలకు ముందే తోట త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం సాగినా… అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా అందుకు ముహూర్తం కుదిరింది. వైసీపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు..తోట వియ్యంకుడు కావడంతో ఆ వైపు నుంచి కూడా నరుక్కుంటూ వచ్చినట్టు సమాచారం. వైసీపీతో పాటు బీజేపీ నుంచి కూడా ఆహ్వానమున్నా… వైసీపీలో చేరేందుకే తోట నిర్ణయించుకున్నారట. పార్టీలోకి చేరిన తర్వాత ఓ కీలక పదవితో పాటు జిల్లాలో మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తామని వైసీపీ చేసిన ఆపర్ తోనే తోట ఆ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారట. వచ్చేవారికి ఎటువంటి పదవులు లేకపోవడంతో..పార్టీకి రాజీనామా చేస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వైసీపీలోకి తోట చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.  అదే కనుక జరిగితే టీడీపీ డీలా చెడటం ఖాయం. కాపు ఓటు బ్యాంకును ఆ పార్టీ ప్రస్టేజ్‌గా భావిస్తోంది. వారి ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద పీట వేసింది. మరి తాజా పరిణామాల నుంచి కోలుకోడానికి రాజకియాల్లో అపర చాణుక్కుడిగా పేరున్న చంద్రబాబు ఎటువంటి విరుగుడు చర్యలు చేపడతాడో చూడాలి.