AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Mayor Inspects: పారిశుద్ధ్యం ప‌ట్ల నిర్లక్ష్యం వ‌హిస్తే క‌ఠినచ‌ర్యలు.. ఉస్మానియా ఆస్పత్రి అపరిశుభ్రతపై మేయ‌ర్ ఆగ్రహం..!

ఉస్మానియా ఆసుపత్రిలో హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు. ఆసుపత్రి ప‌రిస‌రాల్లో పారిశుద్ధ్య పనులను మేయర్ ప‌రిశీలించారు.

GHMC Mayor Inspects: పారిశుద్ధ్యం ప‌ట్ల నిర్లక్ష్యం వ‌హిస్తే క‌ఠినచ‌ర్యలు.. ఉస్మానియా ఆస్పత్రి అపరిశుభ్రతపై మేయ‌ర్ ఆగ్రహం..!
Ghmc Mayor Gadwal Vijayalaxmi Surprise Visit
Balaraju Goud
|

Updated on: May 25, 2021 | 1:54 PM

Share

GHMC Mayor Gadwal Vijayalaxmi Inspects: ఉస్మానియా ఆసుపత్రిలో హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు. ఆసుపత్రి ప‌రిస‌రాల్లో పారిశుద్ధ్య పనులను మేయర్ ప‌రిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వహ‌ణ ప‌ట్ల అధికారుల‌పై మేయ‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పేషెంట్ల దగ్గరికి వెళ్లి వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు అందిస్తున్న ట్రీట్‌మెంట్‌ గురించి ఆరాతీశారు. రోగులంతా ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని మేయర్ విజయలక్ష్మి భరోసానిచ్చారు.

అంతకు ముందుకు ఆసుపత్రి వద్ద ఉన్న రూ. 5 బోజనం కౌంటర్ వద్ద చెత్తను చూసి మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తీసి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ కౌంటర్ హాస్పిటల్‌కు ఇబ్బందిగా ఉండడం గమనించిన మేయర్.. అక్కడి నుంచి అన్నపూర్ణ కాంటీన్ కౌంటర్‌ను వెంటనే షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప‌ట్ల రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా, ప‌రిస‌రాల‌ను ఎప్పటిక‌ప్పుడు శుభ్రంగా ఉంచేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను మేయ‌ర్ ఆదేశించారు. పారిశుద్ధ్యం ప‌ట్ల నిర్లక్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని విజ‌య‌ల‌క్ష్మి హెచ్చరించారు.

ఎఎంహెచ్‌వో, ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎంవోలతో కలసి ఆసుపత్రి పరిసరాలను మేయర్ పరిశీలించారు. ఆసుపత్రిలో మెడికల్ వేస్ట్, పారిశుద్ధ్య లోపాలను గమనించిన మేయర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.

ఆసుపత్రిలో పేషెంట్లతో మాట్లాడిన మేయర్.. కరోనా వచ్చినవారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. అయా వార్డులో, ఆపరేషన్ థియేటర్, మార్చురీ సమస్యలను ఆసుపత్రి సిబ్బంది మేయర్ దృష్టికి రాగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

అనంతరం హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ విజయలక్ష్మి రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త చెదారం వెంటనే తొలగించాలని ఆదేశించారు. నగరం లో పారిశుద్ధ్య పనులు బాగా జరుగుతున్నాయని, ప్రజలు కూడా తమ వంతుగా చెత్తను దయ చేసి ఓపెన్ పాయింట్లలో వేయకుండా ఆటోలకు మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, గ్రేటర్ హైదరాబాద పరిధిలో పీవర్ సర్వే చురుకుగా సాగుతుందన్నారు. నిన్నటి వరకు రెండో విడతలో 1,522 టీంలతో 3,42,479 ఇళ్లలో ఫీవర్ సర్వే నిరహించామన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా నిన్న 66,610 మందికి బోజనం పంపిణీ చేయడం జరిగింది అని మేయర్ తెలిపారు.

Read Also….  Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ వారికి కూడా వస్తుంది.. తస్మాత్‌ జాగ్రత్త.. కీలక విషయాన్ని వెల్లడించిన వైద్య నిపుణులు