మొన్న రాజీనామా.. నేడు సీఎం జగన్‌కు లేఖ.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..

మొన్న రాజీనామా.. నేడు సీఎం జగన్‌కు లేఖ.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే
K Sammaiah

|

Feb 09, 2021 | 3:52 PM

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినందుకు గంటా తన లేఖలో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ ను మరింత బలోపేతం చేసేందుకు సూచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎంని కోరారు.

వైజాగ్ ప్లాంట్ కు సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. వైజాగ్ ప్లాంటులో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. ఈ అంశంలో అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గంటా విజ్ఞప్తి చేశారు.

Read more:

తెలంగాణలో వలస పార్టీలకు పుట్టగతులుండవు.. సీమాంధ్ర ఫ్యాక్షన్‌ రాజకీయాలు తెలంగాణలో సాగవన్న మంత్రి గంగుల

అన్న మీద కోపం ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి గానీ ఇక్కడేం పని..? బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తుందన్న వీహెచ్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu