ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.. వాదోపవాదాల అనంతరం విచారణ ఈ నెల 17కు వాయిదా

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ రూపొందించిన విషయం తెలిసిందే. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ..

ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.. వాదోపవాదాల అనంతరం విచారణ ఈ నెల 17కు వాయిదా
Follow us
K Sammaiah

|

Updated on: Feb 09, 2021 | 4:04 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ రూపొందించిన విషయం తెలిసిందే. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ-వాచ్‌ పేరుతో యాప్‌ను రూపొందించారు. అయితే ఈ యాప్‌ను అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక యాప్‌ ఇప్పటికే ఉందని మరో యాప్‌ అవసరం లేదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. యాప్ రూపొందించడంలో సాంఘిక సంక్షేమశాఖ రూపొందించిన సోర్స్‌ను ఉపయోగించినట్లు గమనించామని ప్రభుత్వ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాళ్ల అనుమతి తీసుకున్నారో లేదో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం 24 అంశాలపై కొర్రీలకు సమాధానం ఇవ్వాలని లేఖ రాశామన్నారు. సమాధానం వచ్చాక యాప్ సర్టిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ లాయర్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిఘా యాప్‌ పనిచేయడం లేదని ఎన్నికల కమిషన్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీ-విజిల్ యాప్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ యాప్ లేదా సి-విజిల్ యాప్ ఉపయోగించుకుంటే.. అభ్యంతరం ఉందా? అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తమకేమీ అభ్యంతరంలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది.

Read more:

మొన్న రాజీనామా.. నేడు సీఎం జగన్‌కు లేఖ.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!