అన్న మీద కోపం ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి గానీ ఇక్కడేం పని..? బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తుందన్న వీహెచ్
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. జగన్ కోసం షర్మిల..
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. జగన్ కోసం షర్మిల చాలా కష్టపడింది. జగన్ షర్మిల మధ్య విభేదాలు నిజమేనని వి.అనుమంతరావు వ్యాఖ్యానంచారు. జగన్‌పై పగ తీర్చుకోవాలనుకుంటే ఆంధ్ర లో పార్టీ పెట్టాలి కానీ ఇక్కడ ఎం పని అని వీహెచ్ ప్రశ్నించారు.
షర్మిల పదే పదే నల్లగొండ గురించి మాట్లాడుతున్నారు అంటే నల్లగొండ నాయకులు అమేతో వెళ్లే అవకాశం ఉందని వీహెచ్ అనుమానం వ్యక్తం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి లబ్ది పొందిన వాళ్ళు ఆమెకు సహకరించే అవకాశం ఉందని వీహెచ్ తెలిపారు.
తెలంగాణలో ఒక సామాజిక వర్గం షర్మిలకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్లు హనుమంతరావు తెలిపారు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తుందని వీహెచ్ అన్నారు. పార్టీ పెట్టించి, ఓట్లు చీల్చడం ద్వారా లబ్ది పొందాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పారు.
ప్రస్తుత రాకీయ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలని, లేకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని వీహెచ్ తెలిపారు. షర్మిల పార్టీ కచ్చితంగా భవిష్యత్తులో కొంత ప్రభావం అయితే చూపుతుందని వీహెచ్ విశ్లేషించారు.
Read more:
సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం.. ధన్యవాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి