AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila : షర్మిల కొత్త పార్టీపై క్రిస్టల్ క్లియర్‌.. తెలంగాణలో “రాజన్న రాజ్యం” టీవీ9తో ఫస్ట్ రియాక్షన్..

YS Sharmila New Party: క్రిస్టల్ క్లియర్‌గా తెలిపోయింది. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తేల్చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో పార్టీ పెట్టనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు... కొత్త పార్టీతో ఎందుకు రాకూడదు...

YS Sharmila : షర్మిల కొత్త పార్టీపై క్రిస్టల్ క్లియర్‌..  తెలంగాణలో రాజన్న రాజ్యం టీవీ9తో ఫస్ట్ రియాక్షన్..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Feb 09, 2021 | 3:19 PM

Share

YS Sharmila New Party : క్రిస్టల్ క్లియర్‌గా తెలిపోయింది. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తేల్చేశారు. వైఎస్సార్‌‌టీపీ పేరుతో పార్టీ పెట్టనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు… కొత్త పార్టీతో ఎందుకు రాకూడదు… ఇది షర్మిల ఫస్ట్ రియాక్షన్… ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పాటు అంశాన్ని ఖండించకపోయినా… ఆ దిశగానే అడుగులు ఉండబోతున్నాయని తేల్చేశారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

రెండు రాష్ట్రాలను ఊపేసిన షర్మిల బిగ్‌మీటింగ్‌ స్టార్ట్ అయింది. బెంగళూరు నుంచి ఉదయమే హైదరాబాద్‌లో దిగిన ఆమె… నేరుగా లోటస్ పాండ్‌కు వచ్చారు. చాలారోజుల తర్వాత లోటస్ పాండ్‌కు వచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై షర్మిలక్క అంటూ నినాదాలు చేశారు అభిమానులు. జోహార్ వైఎస్‌ఆర్‌ అంటూ స్లోగన్స్‌తో లోటస్ పాండ్ మారుమోగిపోయింది. భారీగా తరలివచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

తెలంగాణలో గ్రౌండ్‌ రియాల్టీ తెలుసుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేసినట్టు టీవీ9తో స్వయంగా షర్మిల చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదన్న షర్మిల… వైఎస్సార్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో వస్తాం… రాజన్న రాజ్యం తీసుకొస్తామని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా నేతలతో చర్చిస్తున్నామని.. అన్న జిల్లాల నేతలతోనూ సమావేశం కానున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లా నేతలతోనూ కలుస్తామన్నారు.

ఇవి కూడా చదవండి :

ఎర్రకోట హింసాత్మక ఘటనలకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్ AP Local polls 2021 : ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. గొల్లప్రోలులో ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Feb 2021 02:57 PM (IST)

    షర్మిల – జగన్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సజ్జల క్లారిటీ

    జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సజ్జల క్లారిటీ ఇచ్చారు. షర్మిల, జగన్ మధ్య విబేధాలు లేవని, వారివి కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిలను పార్టీ పెట్టొద్దని జగన్ సూచించారని సజ్జల తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమపై నమ్మకం పెట్టుకున్న వారికి న్యాయం చేయలేమేమో అని జగన్ భావిస్తున్నారని చెప్పారు. అయితే, తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన షర్మిల సహజంగానే భిన్న ఆలోచనలు చేస్తుండొచ్చని, ఆ కారణంగానే ఆమె తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని ఉంటారని సజ్జన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • 09 Feb 2021 02:55 PM (IST)

    పార్టీ ఏర్పాటు వద్దని షర్మిలకు జగన్ చాలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు : సజ్జల

    పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో ఏ ప్రయత్నం చేసినా.. ఏపీలో గ్యాప్ ఏర్పడే అవకాశం వస్తుందని జగన్ భావించారని సజ్జల చెప్పుకొచ్చారు. పార్టీ విస్తరణ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని జగన్ అభిప్రాయం అని పేర్కొన్నారు. ఈ కారణంగానే షర్మిల పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా వద్దని నచ్చజెప్పేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన తెలిపారు. పార్టీ ఏర్పాటు వల్ల కలిగే కష్ట, నష్టాలు, రాజకీయంగా ఉన్న పరిమితులు ఇవన్నీ షర్మిలకు జగన్ వివరించారన్నారు. కానీ, షర్మిల తన స్వీయ అనుభవంతో పార్టీ ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్న ఆయన.. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రతి అంశానికి షర్మిలనే బాధ్యురాలు అవుతారని సజ్జల స్పష్టం చేశారు. అయితే జగన్, షర్మిల వ్యక్తిగత సంబంధాలకు, పార్టీలకు సంబంధం ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

  • 09 Feb 2021 02:52 PM (IST)

    తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రియాక్షన్

    తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై వైసీపీ ముఖ్యనేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల నిర్ణయంపై తప్పుడు భాష్యాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సరస్పర సహకారం ఉండాలని జగన్ భావించారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటుందనే తెలంగాణలో పార్టీని వద్దనుకున్నామని ఆయన వెల్లడించారు.

  • 09 Feb 2021 02:47 PM (IST)

    తెలంగాణ ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారా? : షర్మిల

    తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది.. రైతులందరూ సంతోషంగా ఉన్నారా అని షర్మిల ప్రశ్నించారు. ఈరోజులాంటి సమావేశాలు ప్రతి జిల్లాలోనూ ఇక మీదట నిర్వహిస్తామని, పార్టీని ఏవిధంగా నిర్మించాలనేది ప్రతీ జిల్లా వాళ్లతో  చర్చిస్తామని షర్మిల అన్నారు.

  • 09 Feb 2021 02:44 PM (IST)

    తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలి : వైఎస్ షర్మిల

    తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలన్నారు వైఎస్ షర్మిల. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తోడబుట్టిన అన్న అని చెప్పిన ఆమె, జగన్ సహకారం తనకు ఉంటుందని భావిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణలో విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా.. మీరు చెప్పండి అంటూ విలేకరులకు ఎదురు ప్రశ్న వేశారు షర్మిల.

Published On - Feb 09,2021 2:57 PM