సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం.. ధన్యవాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధమైంది. అనుముల మండలం అలీనగర్ సమీపంలో బుధవారం సీఎం కేసీఆర్..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధమైంది. అనుముల మండలం అలీనగర్ సమీపంలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1,04,600 ఎకరాల టేలాండ్ భూములకు సాగునీరు అందించేందుకు రూ.3వేల కోట్లతో 13 ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ఇటీవల అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ నేతలకు ధన్యవాదాలు తెలిపేందుకు అలీనగర్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 12 నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు వాహనాల పార్కింగ్ కోసం 200 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. ఈ క్రమంలో మంత్రి సభా వేదిక, హెలీప్యాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. లిఫ్టు ప్రాజెక్టులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు పాలాభిషేకం చేశారు.
Read more:
ఢిల్లీకి పవన్ కల్యాణ్ పయనం… స్టీల్ ప్లాంట్‌పై బుస్సుమంటారా..? తుస్సుమంటారా..?
ఈ నెల 11న జీహెచ్ఎంసీ పాలకమండలి ప్రమాణస్వీకారం.. సభ్యులు ఏం చేయొచ్చు.. ఏం చేయరాదు..