YS Sharmila: ‘కొత్త పార్టీ సరే.. నాటి నినాదంపై తెలంగాణ ప్రజలకు షర్మిల ఏం చెబుతారు?’..

YS Sharmila New Party: తెలంగాణలో షర్మిల నూతన పార్టీ ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు.

YS Sharmila: ‘కొత్త పార్టీ సరే.. నాటి నినాదంపై తెలంగాణ ప్రజలకు షర్మిల ఏం చెబుతారు?’..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 09, 2021 | 3:44 PM

YS Sharmila New Party: తెలంగాణలో షర్మిల నూతన పార్టీ ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు స్పందించారు. ఇదే అంశంపై మంగళవారం నాడు టీవీ9తో మాట్లాడిన ఆయన.. షర్మిల నిర్ణయంతో వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఏదో ఒప్పందం ప్రకారమే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్న షర్మిల ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని గోనె ప్రకాష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత అని మాట్లాడుతున్నారని, అది పూర్తిగా అసంబద్ధం అని విమర్శించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత లేదన్నారు. వైఎస్ఆర్ పథకాల కంటే మెరుగ్గానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ప్రకాశ్ రావు పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో నూతన పార్టీ ఏర్పాటుకై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ పాలన, ప్రజల సమ్యలపై వారితో చర్చించారు. అయితే, తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ఇక్కడి నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Also read:

Sharmila New Party: షర్మిల కొత్త పార్టీపై వైఎస్ జగన్ అభిప్రాయం ఇది.. వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి..

మంగళంపల్లి, లతామంగేష్కర్ వంటి ఎందరినో తెలుగు తెరకు పరిచయం చేసిన స్వర బ్రహ్మ సుసర్ల దక్షిణామూర్తి వర్ధంతి నేడు

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?