AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విషయంలో తన దారి తనదే.. నాదారి నాదే.. పార్టీ ఏర్పాటుపై ఎవరితోనూ సంప్రదించలేదన్న వైయస్‌ షర్మిల

ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి వైయస్ షర్మిల రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ప్రారంభమైంది. తన తండ్రి దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి..

ఆ విషయంలో తన దారి తనదే.. నాదారి నాదే.. పార్టీ ఏర్పాటుపై ఎవరితోనూ సంప్రదించలేదన్న వైయస్‌ షర్మిల
K Sammaiah
|

Updated on: Feb 09, 2021 | 4:49 PM

Share

ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి వైయస్ షర్మిల రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ప్రారంభమైంది. తన తండ్రి దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరుతో తెలంగాణలో ఆమె పార్టీని ప్రారంభించబోతున్నట్లు స్పష్టమైపోయింది. లోటస్‌పాండ్‌లో నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల పార్టీ ఏర్పాటుపై సంకేతాలు ఇచ్చారు. ఇక వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు.

లోటస్ పాండ్ లోని కార్యాలయం వద్ద మీడియాతో షర్మిల మాట్లాడారు. తన పార్టీ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని షర్మిల తెలిపారు. ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని చెప్పారు. తెలంగాణలో వైసీపీ విభాగంతో కలసి పని చేస్తానని తెలిపారు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా తన దారి తనదేనని అన్నారు. తెలంగాణ రాజకీయ అంశాల వరకే తమ పార్టీ పరిమితమవుతుందని ఏపీలో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు.

మరోవైపు వైయస్‌ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై వైయస్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. షర్మిల ఆదేశాల మేరకు తెలంగాణలో పార్టీ విస్తరణకు పాటు పడతామని చెప్పారు. రాబోవు కాలంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని అన్నారు.

Read more:

అన్న మీద కోపం ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి గానీ ఇక్కడేం పని..? బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తుందన్న వీహెచ్‌

తెలంగాణలో వలస పార్టీలకు పుట్టగతులుండవు.. సీమాంధ్ర ఫ్యాక్షన్‌ రాజకీయాలు తెలంగాణలో సాగవన్న మంత్రి గంగుల

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం