AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Political War: ఒకే పార్టీ- రెండు వర్గాలు.. మాజీ మంత్రి వర్సెస్ MLA.. ఖమ్మం జిల్లాలో కత్తులు నూరుతున్న నేతలు..

ఖమ్మం జిల్లా పాలేరులో తుమ్మల వర్సెస్ కందాల గా మారింది పరిస్థితి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాస్తా ఒకే పార్టీ- రెండు వర్గాలుగా మారింది. ఇద్దరి మధ్య గొడవ.. చినికి చినికిగాలి వానగా మారి పోలీస్టేషన్ వరకూ వెళ్లింది. మాజీ మంత్రి తుమ్మల...

Political War: ఒకే పార్టీ- రెండు వర్గాలు.. మాజీ మంత్రి వర్సెస్ MLA.. ఖమ్మం జిల్లాలో కత్తులు నూరుతున్న నేతలు..
Tummala Nageswara Rao Vs Pa
Sanjay Kasula
|

Updated on: Aug 02, 2021 | 6:48 PM

Share

ఖమ్మం జిల్లా పాలేరులో తుమ్మల వర్సెస్ కందాల గా మారింది పరిస్థితి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాస్తా ఒకే పార్టీ- రెండు వర్గాలుగా మారింది. ఇద్దరి మధ్య గొడవ.. చినికి చినికిగాలి వానగా మారి పోలీస్టేషన్ వరకూ వెళ్లింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక వైపు- ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మరో వైపు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. ఇటీవల నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ.. దూకుడు పెంచారు మాజీ మంత్రి తుమ్మల. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది.

ఓ చిన్న ఫ్లెక్సీ ఫోటో గొడవ కాస్తా ఇరు వర్గాల వారు కేసులు పెట్టే వరకూ వెళ్లింది. ఎమ్మెల్యే కందాల వర్గం తుమ్మల వర్గీయులపై కేసు పెడితే.. తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ ఖమ్మం జిల్లా కమిషనర్ విష్ణు వారియర్ ను కలిసింది తుమ్మల నాగేశ్వరరావు వర్గం. ఎమ్మెల్యే చెప్పినట్టు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు తుమ్మల వర్గీయులు.

మీరిరువురూ రాజకీయ విబేధాలను మానేసి.. ఒక అండర్ స్టాండింగ్ కి రావాలంటూ.. పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తుమ్మల వర్గీయులు. మేమిచ్చిన కంప్లయింట్లు పట్టించుకోండా వారిచ్చిన ఫిర్యాదులకు మాత్రమే విలువనిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగక కందాల కాంగ్రెస్ ఏజెంట్‌గా మారి.. తమను ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ చేస్తున్నారు తుమ్మల వర్గం వారు. ఈ గొడవపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..