పెగాసస్ వివాదం పై తొలిసారి బీజేపీకి మిత్ర పక్షం నుంచి ఎదురుగాలి.. ఎవరి నుంచి అంటే.. ?

దేశాన్ని కుదిపివేస్తున్న పెగాసస్ వివాదంపై మొదటిసారిగా బీజేపీ మిత్ర పక్షం నుంచి 'ఎదురు గాలి వీచింది'...దీనిపై దర్యాప్తు జరగాలన్న విపక్షాల డిమాండుతో బీహార్ సీఎం . జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ ఏకీభవించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, జడ్జీలు, ఇతర...

పెగాసస్ వివాదం పై తొలిసారి బీజేపీకి మిత్ర పక్షం నుంచి ఎదురుగాలి.. ఎవరి నుంచి అంటే.. ?
Bihar Cm Nitish Kumar

దేశాన్ని కుదిపివేస్తున్న పెగాసస్ వివాదంపై మొదటిసారిగా బీజేపీ మిత్ర పక్షం నుంచి ‘ఎదురు గాలి వీచింది’…దీనిపై దర్యాప్తు జరగాలన్న విపక్షాల డిమాండుతో బీహార్ సీఎం . జేడీ-యూ అధినేత నితీష్ కుమార్ ఏకీభవించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, జడ్జీలు, ఇతర ప్రముఖులను డిస్టర్బ్ చేసి..వేధించే ఈ విధమైన ఫోన్ ట్యాపింగులు ఏ మాత్రం జరగరాదని ఆయన అన్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే అన్నారు. గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, పార్లమెంటులో కూడా ఈ సమస్య ప్రస్తావనకు వచ్చిందని ఆయన చెప్పారు. అందువల్ల తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ జరగాలన్నారు. మొత్తం విషయమంతా బహిర్గతం కావాల్సిందే.. ఇది అసలు ఎలా జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. ఎవరికీ గ్యారంటీ లేదు.. అని నితీష్ కుమార్ మీడియా వద్ద వ్యాఖ్యానించారు. ఆయన ఇంత నిర్దుష్టంగా ఇంత బాహాటంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇరకాటంగా పరిణమించాయి. పెగాసస్ స్కాండల్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని విపక్షాలు మొదటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

పార్లమెంటులో దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతున్నప్పటికీ.. ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఈ వివాదంపై దర్యాప్తు అవసరం లేదని, ఫోన్ ట్యాపింగ్ వంటిదేమీ జరగడం లేదని చెబుతూ వస్తోంది. పైగా పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తే చాలునని కూడా అంటోంది. కానీ ఇప్పుడు స్వయంగా తమ మిత్ర పక్షమైన జేడీ-యూ నేత ఇలా దర్యాప్తు జరగాలని కోరడంతో బీజేపీ అయోమయంలో పడింది. ఇలా ఉండగా పెగాసస్ పై దర్యాప్తు జరగాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది.

మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్‌ పెట్టుకోలేదని..:Police attack Video.

 పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.

 చిరుతలతో దోస్తాన్ ఏంద్రా సామీ..!మూడు చిరుతలను హాగ్ చేసుకొని పడుకున్న వ్యక్తి..(వీడియో):Man with Cheeta video.

 పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.

Click on your DTH Provider to Add TV9 Telugu