Etela Rajender Yagam: గ్రహశాంతి చేయించుకుంటున్న మాజీ మంత్రి.. ఆరుగురు పండితులతో యాగాలు, పూజలు.. కారణం అదేనా..!
రాజకీయ అనిశ్చిత్తితో పొలిటికల్ చౌరస్తా లో నిలబడిన మాజీ మంత్రి ఈటల.. గ్రహశాంతి చేస్తున్నారా.? యాగాలు చేస్తే గండం గట్టెక్కి మళ్లీ పూర్వ వైభవం కలిసివస్తుందా..? ఆయన పూజలు ఫలించేనా ..?
Etela Rajender Yagam: రాజకీయ అనిశ్చిత్తితో పొలిటికల్ చౌరస్తా లో నిలబడిన మాజీ మంత్రి ఈటల.. గ్రహశాంతి చేస్తున్నారా.? యాగాలు చేస్తే గండం గట్టెక్కి మళ్లీ పూర్వ వైభవం కలిసివస్తుందా..? ఆయన పూజలు ఫలించేనా ..? ఇంతకూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏం చేస్తున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు గత కొంతకాలంగా రాజకీయంగా కలసి రావడం లేనట్లు కనిపిస్తోంది. ఒక వైపు ఉన్న మంత్రి పదవి పోవడం,మరో వైపు భూ కబ్జా కేసుల విచారణ తో ఈటెలకు మనశాంతి లేకుండా పోతుంది. గడిచిన మూడు రోజులుగా శామిర్‌పేట్‌లోని ఆయన నివాసంలో జరుగుతున్న పూజలు అందుకేనా అంటే అవుననే అనిపిస్తుంది. తాజా పరిణామాల నుండి ఉపశమనం పొందేందుకు, రాబోయే రాజకీయ భవిష్యత్ లో సక్సెస్ కోసం.. శత్రువుల నుండి రక్షణ కోసం మాజీ మంత్రి ఆరుగురు పండితులతో యాగాలు, పూజలు చేయడం ఇప్పుడు ఆసక్తి గా మారింది.
ప్రభుత్వం ఈటల రాజేందర్ భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు అని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి విచారణ మొదలు పెట్టినప్పటి నుండి రాజకీయ భవిష్యత్ కోసం ఈటల చర్చోపచర్చలు చేస్తున్నారు..కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలతో చర్చలు జరిపి చివరకు బీజేపీ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తుంది. దీంతో పార్టీ మారే ముందు శాంతి పూజలతో పాటు శత్రువుల నుండి రక్షణ కోసం శత్రు సంహరక పూజలు, దోష నివారణ పూజలు చేస్తున్నట్టు సమాచారం. మూడు రోజులుగా ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సమయంలో కుటుంబ సభ్యులు మినహా సిబ్బంది అంతా బయటకు పంపుతున్నట్టు సమాచారం..
మొత్తానికి ఈటల రాజేందర్‌తో పాటు కుటుంబ సభ్యులంతా తాజా పరిణామాలనుండి రిలీఫ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈ పూజలు చేస్తున్నట్లు ఈటల సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
Read Also… Lockdown Extension: జూన్ 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. సరుకులు ఇంటి వద్దకు చేర్చేందుకు అనుమతి