మా గొంతు నొక్కుతున్నారు: మాజీ సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే గొంతు నొక్కుతున్నారని మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలోని మీడియా పాయింట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ విషయంలో సాక్ష్యాధారాలతో చూపించామని.. మాకు భయపడి.. మా ముగ్గురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్‌ని సస్పెండ్ చేశారన్నారు. అసెంబ్లీలో మా వాదన కూడా వినాల్సిన అవసరం లేదా..? అని పశ్నించారు. రైతులకు రూ.12,500 ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి.. ఇప్పుడు.. కేంద్రం రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 […]
అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే గొంతు నొక్కుతున్నారని మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలోని మీడియా పాయింట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ విషయంలో సాక్ష్యాధారాలతో చూపించామని.. మాకు భయపడి.. మా ముగ్గురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్‌ని సస్పెండ్ చేశారన్నారు. అసెంబ్లీలో మా వాదన కూడా వినాల్సిన అవసరం లేదా..? అని పశ్నించారు. రైతులకు రూ.12,500 ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి.. ఇప్పుడు.. కేంద్రం రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 ఇస్తామని అంటున్నారు. మాట తప్పం.. మడమ తిప్పమని చెప్పిన మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని..? అన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సభలో మేము లేవనెత్తిన అంశాల మీద సమాధానాలు చెప్పలేక.. ప్రభుత్వం విరుద్దంగా ప్రవర్తిస్తోంది. ప్రజావేదికను కూల్చడం.. ప్రతిపక్షనేత ఉంటున్న ఇల్లుపై దృష్టి పెట్టడం మాని.. ఇకనైనా సభను సజావుగా సాగనివ్వండని సూచించారు. మా సభ్యుల సస్పెన్షన్‌ను భేషరతుగా ఎత్తివేయాలి. సస్పెండ్ చేస్తే.. భయపడిపోతామా..? బయటి నుంచే ప్రజల తరుపున పోరాటం చేస్తామన్నారు. గతంలో వాళ్ల మాదిరిగా మేము మైక్ విరగగొట్టలేదు.. కాగితాలు చింపి స్పీకర్ మీద వేయలేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు.