AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GVMC : టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులపైనే ఫోకస్‌.. స్టీల్‌ సిటీలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ షురూ చేసిన అధికార వైసీపీ

దెబ్బకొడితే...కొట్టినట్లు ఉండకూడదు. కానీ..మైండ్‌ బ్లాక్‌ అవ్వాలి. GVMC ఎన్నికల్లో ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలోఅవుతోంది అధికార YCP. కార్పొరేషన్‌..

GVMC : టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులపైనే ఫోకస్‌.. స్టీల్‌ సిటీలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ షురూ చేసిన అధికార వైసీపీ
Venkata Narayana
|

Updated on: Feb 23, 2021 | 6:01 PM

Share

దెబ్బకొడితే…కొట్టినట్లు ఉండకూడదు. కానీ..మైండ్‌ బ్లాక్‌ అవ్వాలి. GVMC ఎన్నికల్లో ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలోఅవుతోంది అధికార YCP. కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందే టిడిపికి షాకిస్తోంది ఫ్యాన్‌ పార్టీ. సాగరతీరంలో సైకిల్‌ పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులపై ఫోకస్‌ పెట్టింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టేసింది. అంతేకాదు, ‘త్వరలో టిడిపి ఖాళీ అవుతుంది…భవిష్యత్తులో పెద్దసంఖ్యలో ఏకగ్రీవాలవుతాయి’. అని తేల్చి చెబుతూ GVMC ఎన్నికలకు ముందే విపక్ష టీడీపీకి….అధికారపార్టీ ఇస్తున్న వార్నింగ్‌ ఇది. అన్నట్టుగానే …స్టీల్‌ సిటీలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది వైసీపీ. కార్పొరేషన్‌ ఎన్నికల వేళ… టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులపైనే ఫోకస్‌ పెట్టింది. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా14వ డివిజన్‌లో టీడీపీ తరపున నామినేషన్‌ వేసిన అభ్యర్థి నరసింహరాజు అలియాస్‌ బాక్సర్‌ రాజు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు.

విశాఖ గ్రేటర్‌లో వైసీపీ తన అధికారిక హవా కొనసాగిస్తోంది. విపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దఎత్తున వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇదే అంశం గ్రేటర్‌ విశాఖలో పొలిటికల్‌ హీట్‌ రేపుతోంది. ఇవాళ చేరినవాళ్లే కాదు…ఎన్నికలు అయ్యేలోపు మరికొందరు కూడా సైకిల్‌ దిగి ఫ్యాన్‌ కిందకు వస్తారని తెలుస్తోంది. జగన్‌ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని…అందుకే TDP నుంచి వలసలు మొదలయ్యాయని, త్వరలో మరింత వస్తారని చెప్పుకొస్తున్నారు ఆ పార్టీ కీలకనేత ఎంపీ విజయసాయిరెడ్డి.

అంతేకాదు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ గ్రేటర్‌ పీఠంపైనే ఫుల్ ఫోకస్‌ పెట్టారు. ఎలాగైనా సరే ఈసారి జీవీఎంసీపై వైసిపి జెండా ఎగరాలని పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన…కొన్ని నెలల నుంచి విశాఖలోనే తిష్టవేశారు. వార్డు స్థాయి వరకూ పార్టీని పటిష్ఠపరుస్తూనే…ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపై దృష్టిపెట్టారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట…ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను వైసీపీలో చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో కేడర్‌ను ఉత్సాహపరుస్తూ ….ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసి వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారు. మొత్తానికి స్టీల్‌సిటీలో టీడీపీని ఖాళీ చేసేందుకు జగన్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.

Read also :

టీకాంగ్రెస్‌ మేకపోతు గాంభీర్యం.. బీజేపీ నాయకులపై గుస్సా, టీఆర్ఎస్ నేతల కౌంటర్ అటాక్ @ తెలంగాణ పాలిటిక్స్

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!