కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్‌లను ప్రవేశపెడుతున్నారు. ఎవరికి ఓటేసిందీ వీవీప్యాట్‌లో 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. అంటే ఈసారి ప్రతి ఓటుకి 7సెకన్ల సమయం ఎక్కువ పడుతుంది. మండే ఎండలు.. కొత్తగా వీవీప్యాట్‌ల వినియోగం… ఒకేసారి రెండు ఓట్లు వేయాల్సి రావడం..కాబట్టి ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని అదనంగా మరో గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి […]

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 5:20 PM

ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్‌లను ప్రవేశపెడుతున్నారు. ఎవరికి ఓటేసిందీ వీవీప్యాట్‌లో 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. అంటే ఈసారి ప్రతి ఓటుకి 7సెకన్ల సమయం ఎక్కువ పడుతుంది. మండే ఎండలు.. కొత్తగా వీవీప్యాట్‌ల వినియోగం… ఒకేసారి రెండు ఓట్లు వేయాల్సి రావడం..కాబట్టి ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని అదనంగా మరో గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని అదనంగా గంట మేర పెంచారు. అంటే సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది వేసవి తీవ్రత గత ఏడాది కంటే అధికంగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించడంతో…శాంతిభద్రతల సమస్య పెద్దగా లేని 169 నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.