MP Ranjith Reddy: టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్..
MP Ranjith Reddy: టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'టీఆర్ఎస్
MP Ranjith Reddy: టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని చెప్పారు. తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి రావద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. డా. రంజిత్ రెడ్డి 2004లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై 14,391 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులను కరోనా విడిచిపెట్టడం లేదు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వారం రోజులు రైతుల కోసం డిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయన కరోనా సోకినట్లు తేల్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే, తనతో సన్నిహితంగా తిరిగిన వారు.. గతకొన్ని రోజులుగా ఆయన కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ గానే ఉందని వైద్యులు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు,అధికారులకు ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.#COVID19 #StayHome
— Dr Ranjith Reddy – TRS (@DrRanjithReddy) December 25, 2021