AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుపేదల కోసం కాంగ్రెస్ కొత్త పథకం

న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయాద్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఏడాదికి కనీసం రూ. 72,000 అంటే నెలకు రూ. 6000 అందచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కనీస ఆదాయ గ్యారంటీ పథకం పేరుతో దేశంలోని సుమారు 25 కోట్ల మంది పేదలకు ఈ మొత్తం అందజేస్తామన్నారు. దేశ జనాభాలో వీరు 20 శాతం మంది ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేసింది. మోదీ ధనవంతులు […]

నిరుపేదల కోసం కాంగ్రెస్ కొత్త పథకం
Ram Naramaneni
|

Updated on: Mar 25, 2019 | 3:36 PM

Share

న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయాద్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఏడాదికి కనీసం రూ. 72,000 అంటే నెలకు రూ. 6000 అందచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కనీస ఆదాయ గ్యారంటీ పథకం పేరుతో దేశంలోని సుమారు 25 కోట్ల మంది పేదలకు ఈ మొత్తం అందజేస్తామన్నారు. దేశ జనాభాలో వీరు 20 శాతం మంది ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేసింది. మోదీ ధనవంతులు చౌకీధార్(కాపలాధారుడు)… కాని కాంగ్రెస్ పేద ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ల బీజేపీ పాలన అంబానీకి దోచిపెట్టడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతి ఏడాది నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. తాము పథకం ప్రకటించే ముందు అన్ని విధాలుగా ఆలోచించామని,  ఒక్క సారి హామి ఇచ్చాక ఇక వెనక్కి తిరిగి చూడమని రాహుల్‌ గాంధీ అన్నారు.

చత్తీస్‌ఘడ్‌లో రెండు నెలల క్రితం జరిగిన ఓ ఎన్నికల ప్రచారసభలో కనీస ఆదాయ గ్యారంటీ పథకం తెస్తామని రాహుల్ హామి ఇచ్చారు. తరవాత దీనిపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ  చర్చించి… సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. దేశంలోని కనీసం 20 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నారని పార్టీ అంచనా వేసింది. వీరందరికి నెలకు రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ. 72,000 చెల్లించాలని పార్టీ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలు పరోక్షంగా..25 కోట్ల మంది పేదలు ప్రత్యక్షంగా లబ్ధి కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాగా ఇదే ప్రధాన ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయనుంది.

చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?