AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేత దివ్యవాణికి, హాస్యనటుడు ఆలీ కౌంటర్

సినీనటి, టీడీపీ నేత దివ్యవాణికి, నటుడు ఆలీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్యాకేజీలిస్తే వైసీపీలోకి వెళ్లామంటూ.. మాపై ఆరోపణలు చేస్తున్న దివ్యవాణి ఏమైనా తొంగి చూసిందా..? లేక సెల్ఫీలు ఏమైనా తీశారా..? అంటూ విమర్శించారు. అలాగే.. మరి దివ్యవాణికి ఎంత ప్యాకేజీ అందితే.. టీడీపీలోకి వెళ్లిందో చెప్పాలి అని ఆలీ ప్రశ్నించారు. వివిధ భాషల్లో తాను 11 వందలకు పైగా సినిమాల్లో నటించానన్నారు ఆలీ. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తనను గుర్తిస్తారన్నారు. ఏపీ దాటితే దివ్యవాణిని […]

టీడీపీ నేత దివ్యవాణికి, హాస్యనటుడు ఆలీ కౌంటర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 03, 2019 | 12:30 PM

Share

సినీనటి, టీడీపీ నేత దివ్యవాణికి, నటుడు ఆలీ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్యాకేజీలిస్తే వైసీపీలోకి వెళ్లామంటూ.. మాపై ఆరోపణలు చేస్తున్న దివ్యవాణి ఏమైనా తొంగి చూసిందా..? లేక సెల్ఫీలు ఏమైనా తీశారా..? అంటూ విమర్శించారు. అలాగే.. మరి దివ్యవాణికి ఎంత ప్యాకేజీ అందితే.. టీడీపీలోకి వెళ్లిందో చెప్పాలి అని ఆలీ ప్రశ్నించారు.

వివిధ భాషల్లో తాను 11 వందలకు పైగా సినిమాల్లో నటించానన్నారు ఆలీ. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తనను గుర్తిస్తారన్నారు. ఏపీ దాటితే దివ్యవాణిని ఎవరూ గుర్తు పట్టరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌లతొ ఉన్నఅనుబంధంతోనే తాను వైసీపీలో చేరానన్నారు ఆలీ.