AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్.. అద్దిరి పోయే ఇంటర్వెల్ బ్యాంగ్

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్దగా ఆడలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారిపోయింది. అయితే సినిమాలో యాక్షన్ సీన్లు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోయిందన్న ప్రశంసలు వచ్చాయి.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్.. అద్దిరి పోయే ఇంటర్వెల్ బ్యాంగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 03, 2026 | 6:15 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఓవరాల్ గా 24 వరకు పైగా సినిమాలు, వెబ్ సిరీసులు ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, మీసయ్య మురుక్కు లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు కొన్ని ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. అయితే వీటికంటే ముందే ఓ తెలుగు యాక్షన్ సినిమా మంగళవారం (నవంబర్ 03) నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 02న థియేటర్లలో విడుదలైంది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు త్రినాథ్ నక్కిన.. నిర్మాతగా మారడంతో పాటు నటుడిగా ఈ సినిమాలో నటించడం విశేషం. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకుంది. అయితే అక్టోబర్ 02న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రధానంగా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. దీంతో తక్కువ రోజులకే థియేటర్లలో నుంచి వెళ్లిపోయిందీ సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనకాపల్లి ప్రాంతంలో బుల్లెట్‌ (తారక్ పొన్నప్ప) అనే రౌడీ పేరంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. డ్రగ్స్ బిజినెస్ చేసే‌ నాయుడు(కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్‌కు తరచూ గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇదే ఊరిలో నిజాయితీగా బతుకుతూ ఏఈగా పనిచేసే సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్).. బుల్లెట్‌ని చూసి ఆకర్షితుడై అతడి‌ గ్యాంగ్‌లో చేరతాడు. ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే (వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడిని మర్డర్ చేస్తారు. అయితే కొన్ని రోజులకు బుల్లెట్ కు సూర్య ఎదురు తిరుగుతాడు? బుల్లెట్టు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తాడు. మరి సూర్య అలా ఎందుకు చేశాడు? అమృత (సంధ్య వశిష్ట)తో సూరి ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్‌, సూర్య, అమృత, నాయుడుల జీవితాలు ఏమయ్యాయి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా పేరు అనకా పల్లి. ఇదొకి విలేజ్ యాక్షన్ డ్రామా. ఖగేష్ తమ్మినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.విక్రమ్, సంధ్యా వశిష్టలతో పాటు తారక్ పొన్నప్ప, త్రినాథరావు నక్కిన, ఇంద్రజ, నందిని రాయ్, సంగీత క్రిష్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దేవ్జాండ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన అనకాపల్లి ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

అనకా పల్లి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..
ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు