AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tharun Bhascker: ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో నాకే తెలియదు.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్

దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తొలి చిత్రం పెళ్లి చూపులు సాధించిన భారీ విజయం, ఆ తర్వాత ఎదురైన ఒత్తిడి గురించి మాట్లాడారు. ఎన్‌ఈ రిపీట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమా ఎలా హిట్టైందో తనకూ తెలియదన్నారు. ఆ విజయం తర్వాత పరిశ్రమలో తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని, అది తనకు తీవ్రమైన ఒత్తిడిని కలిగించిందని వివరించారు.

Tharun Bhascker: ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో నాకే తెలియదు.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్
Tharun Bhascker
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2026 | 5:16 PM

Share

దర్శకుడు తరుణ్ భాస్కర్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపుల గురించి ఎన్‌ఈ రిపీట్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పంచుకున్నారు. పెళ్లి చూపులు చిత్రం సాధించిన అపూర్వ విజయం తర్వాత తాను ఎదుర్కొన్న ఒత్తిడి, స్నేహబంధాల విలువ, అలాగే ఈ నగరానికి ఏమైంది సినిమా పుట్టుక వెనుక ఉన్న కథను ఆయన వివరించారు. పెళ్లి చూపులు చిత్రం భారీ విజయాన్ని అందుకున్న తర్వాత, పరిశ్రమలో తన తదుపరి చిత్రంపై ఎనలేని అంచనాలు ఏర్పడ్డాయని తరుణ్ భాస్కర్ తెలిపారు. “ఎలాంటి నమ్మకం లేకుండానే పెళ్లి చూపులు చేశాను. అది ఎందుకు, ఎలా హిట్టైందో కూడా నాకింకా తెలియదు,” అని ఆయన అన్నారు. ఆ చిత్రం వైజాగ్‌లో విజిల్స్, సీడెడ్‌లో టికెట్లు తెగడం వంటివి తాను ఊహించలేదని, కేవలం ఒక ప్రయత్నం చేశామని వివరించారు. ఈ అనూహ్య విజయం తర్వాత, తదుపరి చిత్రాన్ని కూడా అదే స్థాయిలో విజయం సాధించేలా చేయాలనే ఒత్తిడి తనపై పడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి అలాగే తన గత వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, నిజమైన స్నేహితుల విలువ తెలిసిందని తరుణ్ భాస్కర్ అన్నారు. పెళ్లి చూపులుకు ముందున్న కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన స్నేహితులు, ఆ చిత్రం విజయం సాధించిన తర్వాత కనిపించిన వారికంటే భిన్నంగా ఉన్నారని అన్నారు. తన కష్టాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు కూడా దూరమైనప్పుడు, నలుగురు స్నేహితులు మాత్రం తనను విడిచిపెట్టలేదని తరుణ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు. “ఎక్కడికి పోయినా, బురదలో పడ్డా వాడు చెప్పుకి చూయింగ్ గమ్ లెక్క అంటుకొనే ఉంటాడు కానీ ఎక్కడికీ పోడు,” అంటూ ఆ స్నేహబంధం గొప్పతనాన్ని కొనియాడారు.

ఆ స్నేహితుల బంధం నుంచిస్ఫూర్తి పొంది, అన్ని ఒత్తిళ్లను పక్కనపెట్టి, ప్రామాణికంగా, నిజాయితీగా తీసిన సినిమానే ఈ నగరానికి ఏమైంది అని తరుణ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 తెరకెక్కించేటప్పుడు తమకు అతి పెద్ద పోటీ ఎవరు అంటే, అది ప్రేక్షకులు, వారి అంచనాలే అని ఆయన అన్నారు. తన తొలి సినిమా ఒత్తిడి నుంచి బయటపడి, పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదురైన కొత్త సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “ఇంజనీరింగ్ తర్వాత అడల్టింగ్ అనేది చాలా విభిన్నమైన పరిస్థితి,” అని పేర్కొంటూ, పరిశ్రమలో ప్రవేశించిన తర్వాతే వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని వివరించారు. ఎన్‌ఈ రిపీట్ ట్రైలర్ గురించి మాట్లాడుతూ, అది నాస్టాల్జిక్‌గా, ఫన్నీగా, లేక కేవలం డైలాగులతో నిండి ఉండాలా అనే దానిపై చాలా ఆలోచనలు చేశామని తరుణ్ భాస్కర్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us