ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సమావేశం జరిగింది. ఆర్టీసీ సమ్మెతో పాటు పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులు బాధ్యతా రహితంగా సమ్మె చేస్తున్నారని సీఎం అన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దురహంకారంతోనే […]

ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!


ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సమావేశం జరిగింది. ఆర్టీసీ సమ్మెతో పాటు పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులు బాధ్యతా రహితంగా సమ్మె చేస్తున్నారని సీఎం అన్నారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దురహంకారంతోనే కార్మికులు సమ్మెకు పోయారన్నారు. కార్మికుల డిమాండ్లపై కూడా కేబినెట్‌లో వివరంగా చర్చించామని.. కార్మిక సంఘాలది బాధ్యతరాహిత్యమని.. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదే లేదని సీఎం మరోసారి తేల్చి చెప్పారు.

Click on your DTH Provider to Add TV9 Telugu