AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంతం నెగ్గించుకున్న ఆదినారాయణరెడ్డి ..నెక్ట్స్ టార్గెట్ అతడేనా..?

2014లో వైసీపీ టికెట్ పై గెలిచి పచ్చకండువా కప్పుకుని మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి…ఇప్పుడు బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీలో ఆది ఎంట్రీకి ఫస్ట్‌లో బ్రేక్‌లు పడ్డాయి. మూడు నెలల కిందట పార్టీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి రెడీ అయ్యారు. విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పిలుపు వస్తే బీజేపీలో చేరదామని అనుకున్నారు. కానీ ఒక్క ఫోన్‌ కాల్‌ రాకపోవడంతో అప్పట్లో ఆయన చేరిక ఆగిపోయింది. అప్పట్లో టీడీపీలోకి ఆదిని ఎంట్రీని అడ్డుకున్న […]

పంతం నెగ్గించుకున్న ఆదినారాయణరెడ్డి ..నెక్ట్స్ టార్గెట్ అతడేనా..?
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2019 | 10:37 PM

Share

2014లో వైసీపీ టికెట్ పై గెలిచి పచ్చకండువా కప్పుకుని మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి…ఇప్పుడు బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీలో ఆది ఎంట్రీకి ఫస్ట్‌లో బ్రేక్‌లు పడ్డాయి. మూడు నెలల కిందట పార్టీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి రెడీ అయ్యారు. విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పిలుపు వస్తే బీజేపీలో చేరదామని అనుకున్నారు. కానీ ఒక్క ఫోన్‌ కాల్‌ రాకపోవడంతో అప్పట్లో ఆయన చేరిక ఆగిపోయింది.

అప్పట్లో టీడీపీలోకి ఆదిని ఎంట్రీని అడ్డుకున్న సీఎం రమేష్..ఇప్పుడు బీజేపీలో తన ఎంట్రీకి అడ్డుపుల్లు వేశారని ఆది నారాయణరెడ్డి డౌట్‌. ఇంతకుముందే బీజేపీలో చేరిన సీఎం రమేష్ అదే పార్టీలోకి తనను రానివ్వకుండా హైకమాండ్‌ దగ్గర అడ్డుకున్నారట. అయితే ఇప్పుడు ఆది కూడా బీజేపీలో చేరారు. దీంతో ఈ ఇద్దరి మధ్య పాత వైరాలు మళ్లీ పురివిప్పటం ఖాయం అంటున్నారు. కడపగడపలో ఆధిపత్యపోరు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇప్పటికే సీఎం రమేష్‌ టార్గెట్‌గా ఆది బ్యాచ్‌ విమర్శలు మొదలుపెట్టింది. ప్రొద్దుటూరు వరదరాజులరెడ్డితో రమేష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్నటికినిన్న తన స్వగ్రామం పోట్లదుర్తి నుంచి గాంధీ సంకల్పయాత్ర చేపట్టిన సీఎం రమేష్ పై వరద విరుచుకుపడడం వెనుక ఆది హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరికను అడ్డుకున్న సీఎం రమేష్‌పై రాబోయే రోజుల్లో ఆది ఇంకా విమర్శల దాడి పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇటు ఆది బీజేపీలో చేరే టైమ్‌లో ఎంపీ జీవిఎల్‌ మాత్రమే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఎవరూ లేరు. ప్రస్టేజ్ ఇష్యూ కావడంతో ఢిల్లీ లెవల్లో చక్రం తిప్పి ఆది బీజేపీలో చేరారని తెలుస్తోంది. ఆయన చేరికతో మొత్తానికి కడపగడపలో ఆధిపత్య పోరు మళ్లీ ప్రారంభమైందనేది జిల్లా వాసుల మాట.

Follow Us
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్