గుడివాడలో కులం గురించి మాట్లాడిన చంద్రబాబు

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కులం గురించి మాట్లాడారు. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కుల ప్రస్తావన తెస్తున్నారంటూ విమర్శించారు. దేవినేని అవినాష్ కానీ, వంగవీటి రాధాకృష్ణ కానీ రెండో తరం.. ఈ రాష్ట్రంలో తాను కేఈ కృష్ణమూర్తి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలను కలిపానని అన్నారు. ఆది నారాయణ రెడ్డి, రామ […]

గుడివాడలో కులం గురించి మాట్లాడిన చంద్రబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 5:30 PM

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కులం గురించి మాట్లాడారు. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కుల ప్రస్తావన తెస్తున్నారంటూ విమర్శించారు. దేవినేని అవినాష్ కానీ, వంగవీటి రాధాకృష్ణ కానీ రెండో తరం.. ఈ రాష్ట్రంలో తాను కేఈ కృష్ణమూర్తి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలను కలిపానని అన్నారు. ఆది నారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి.. పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డిలను కలిపానని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రం కోసం అందరూ కలవాలని, లేనిపోని ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మంచిది కాదని చెప్పారు. 60-70 సంవత్సరాలుగా పోరాడినా రాని కాపుల రిజర్వేషన్‌ను తాను ఇచ్చానని చంద్రబాబు అన్నారు. కాపుల రిజర్వేషన్లు తన పరిధిలో లేదని చెప్పిన వైసీపీకి కాపుల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. తన కులం పేదల కులం అని, వెనకబడిన వర్గాలు టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు గుడివాడలో చెప్పారు.