AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Jagga Reddy: వాటికి నిధులు ఏమైనా ఇప్పించావా బండి సంజయ్‌.. జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం..

TPCC Working President Jaggareddy: మసీదు తవ్వితే శివ లింగాల గురించి పక్కన పెట్టు.. కాకతీయుల కాలం నుంచి ఉన్న శివాలాయాలకు నిధులు ఏమైనా ఇప్పించావా అని అని ప్రశ్నించారు.

MLA Jagga Reddy: వాటికి నిధులు ఏమైనా ఇప్పించావా బండి సంజయ్‌.. జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం..
Jagga Reddy
Sanjay Kasula
|

Updated on: May 30, 2022 | 4:40 PM

Share

తెలంగాణలో చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి నిధులు ఏదైనా తెచ్చవా అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మసీదు తవ్వితే శివ లింగాల గురించి పక్కన పెట్టు.. కాకతీయుల కాలం నుంచి ఉన్న శివాలాయాలకు నిధులు ఏమైనా ఇప్పించావా అని అని ప్రశ్నించారు. సంగారెడ్డి లో కల్పకుర్ గ్రామంలో వెయ్యేళ్ళ క్రితం శివాలయం ఉందని.. ఈ దేవాలయానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తవ్వకాలు వదిలి.. భూమి మీద ఉన్న శివాలయాల సంగతి చూడాలని అన్నారు. “బీజేపీ నేతలు భగవంతుడి భక్తులే అయితే.. దేవాలయాల వివరాలన్నీ తీసుకువచ్చి బీజేపీ ఆఫీస్ ముందు కూర్చుంటానని.. మీ కిషన్ రెడ్డే మంత్రిగా ఉన్నారు కదా.. సంజయ్ నీకు చేతనైతే సంగారెడ్డిలోని పురాతన దేవాలయానికి రూ. 20 కోట్లు ఇప్పించాలని” సవాల్ విసిరారు. బండి సంజయ్ మతాల మధ్య చిచ్చు పెడుతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి భయపడుతన్నారా..? అని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్ కు ఉన్న అవగాహనతోనే సైలెంట్‌గా ఉన్నాారా..? అని ప్రశ్నించారు. మసీదు కూల్చాలని ఏ ధర్మంలో ఉంది.. వాల్మీకి రామాయణంలో ఉందా..? రాముడు ఇదే చెప్పాడా..? అని అన్నారు జగ్గారెడ్డి.

ప్రతి పేద వాడికి తెలంగాణ 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు..ఎప్పుడు వేస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు 15 లక్షలు వేసే వరకు బీజేపీ ని  కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. సంవత్సరం కి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఉద్యోగాలు వచ్చే వరకు కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వీటిపై ఎందుకు మాట్లాడడం లేదు.. మసీదులు తవ్వితే శవాలు మీకు శివ లింగాలు మాకు అని ..ఏ గ్రంధంలో ఉంది బండి సంజయ్.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మతాలను రెచ్చగొట్టడం టార్గెట్‌గా పెట్టుకన్నారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రజలకు మేలు జరిగే పనులు ఏదైనా చేయండి అంటూ హితవు పలికారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో తెలంగాణకు స్పెషల్ ప్యాకజ్ ఇప్పటిస్తే బాగుండేదని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఆ ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. ఎంతసేపూ మతాలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు జగ్గారెడ్డి.