గోల్కొండ కోటపై జెండా ఎగరేయడమే టార్గెట్‌.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ కార్యకర్తలు నిరంతరం ముందుండాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. 2023లో గోల్కోండ కోటపై కాషాయం..

గోల్కొండ కోటపై జెండా ఎగరేయడమే టార్గెట్‌.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 18, 2021 | 12:06 AM

TS BJP : రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ కార్యకర్తలు నిరంతరం ముందుండాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. 2023లో గోల్కోండ కోటపై కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జీ తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ప్రత్యేక ఇన్‌ఛార్జీలను నియమించారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలందరు ఆశిస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమైన రోజులని.. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, అధికార దుర్వినియోగంపై కార్యకర్తలు పోరాటం చెయ్యాలని సూచించారు.

ఈ కార్యకర్గ సమావేశానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుట్రలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న రెండేళ్లు బీజేపీకి ఉద్యమాల సంవత్సరం అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై సామాన్యుడు ఆగ్రహంతో ఉన్నాడని.. వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.  ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమెదించిన కమిటీ.. రాబోయే ఉప ఎన్నికలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.