AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp Leader Arrest: సత్తెనపల్లిలో బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావు అరెస్ట్.. పోలీసులమని చెప్పి తీసుకెళ్లడంపై అనుమానాలు..

Bjp Leader Arrest: గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో..

Bjp Leader Arrest: సత్తెనపల్లిలో బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావు అరెస్ట్.. పోలీసులమని చెప్పి తీసుకెళ్లడంపై అనుమానాలు..
Shiva Prajapati
|

Updated on: Jan 18, 2021 | 12:11 PM

Share

Bjp Leader Arrest: గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టాడు. దాంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. సివిల్ డ్రెస్‌లో వచ్చిన కొందరు.. తాము పోలీసులమని చెప్పి తీసుకెళ్లడంపై శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్‌పై కుటుంబ సభ్యులు, సత్తెనపల్లి బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లి పోలీసులకు శ్రీనివాసరావు భార్య శిరీష్ ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. శ్రీనివాసరావు అరెస్ట్‌పై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఘటనలు రాష్ట్రంలో పెను రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆలయాలపై దాడులకు పాల్పడిన కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో బీజేపీ, టీడీపీకి చెందిన నేతలు ఉన్నారని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సత్తెనపల్లి బీజేపీ నేత శ్రీనివాసరావును అరెస్ట్ చేయడంపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

Also read:

నిఖిల్ ’18 పేజెస్’ కీలక షెడ్యూల్ మొదలు!.. సారథి స్టూడియోలో సెట్.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Corona Virus Threat: కరోనా ముప్పు వీరికి వచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువట.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీరో సర్వే..