Mukul Roy Returns: TMCలో చేరిన BJP సీనియర్ నేత ముకుల్​ రాయ్.. తృణమూల్ కాంగ్రెస్‌లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌..

Mukul Roy Returns BJP TO TMC: బీజేపీ సీనియర్​ నేత ముకుల్​రాయ్​ తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. శుక్రవారం మధ్యహ్నం కోల్​కతాలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ కార్యాలయానికి చేరుకున్నా ఆయన...

Mukul Roy Returns: TMCలో చేరిన BJP సీనియర్ నేత ముకుల్​ రాయ్.. తృణమూల్ కాంగ్రెస్‌లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌..
Mukul Roy Returns Bjp To Tm
Follow us

|

Updated on: Jun 11, 2021 | 5:56 PM

బీజేపీ సీనియర్​ నేత ముకుల్​రాయ్​ తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. శుక్రవారం మధ్యహ్నం కోల్​కతాలోని తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ కార్యాలయానికి చేరుకున్నా ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరారు. కొద్ది రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తృణమూల్​ కాంగ్రెస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్​ రాయ్​.. 2017లో పార్టీని వీడిని వీడి టీఎంసీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్‌లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్‌ నెలకొంది. టీఎంసీ ఘన విజయం నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుదారులంతా మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

బెంగాల్‌లో ఎన్నికలు పూర్తి అయినా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ దీదీ మధ్య వార్ నడుస్తున్నట్లు కనబడుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీకి అధికారాన్ని దూరం చేయాలని బీజేపీ సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఫలితం కనబడలేదు. దీదీ పోటీ చేసిన నందిగ్రామ్ లో అయితే ఓడించారు. కానీ రాష్ట్రంలో టీఎంసీ విజయాన్ని బీజేపీ అడ్డుకోలేకపోయింది. మరోవైపు, బెంగాల్‌లో కషాయం కండువా కనబడకుండా చేసేందుకు ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. బీజేపీలో చేరిన నేతలకు ఘర్‌వావసీ తప్పకుండా ఉంటుందని సీఎం మమతా బెనర్జీ సూచనప్రాయం తెలిపారు.

ఇదిలావుంటే.. ఒకప్పుడు మమతకు కుడిభుజంలా వ్యవహరించిన ముకుల్‌రాయ్‌  2017లో బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయన మనస్సు మారినట్టు తెలుస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముకుల్‌రాయ్‌ భార్యను మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ స్వయంగా పరామర్శించడం.. ఇదే ఆయనలో పెద్ద మార్పుకు కారణంగా కనిపిస్తోంది.

AP CM Jagan Delhi Tour: విజయవంతంగా సాగిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Amazing Benefits: పాలలో తేనె కలిపి తాగుతున్నారా..! ఎలాంటి ప్రయోజనాలు.. కలిగే నష్టాలు తెలుసుకోండి..!

Swami Sivanand Baba : కొవిడ్ టీకా తీసుకున్న 125 ఏళ్ల వ్యక్తి..! వ్యాక్సిన్ తీసుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు