AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ మంత్రి వినోద్ కుమర్ సింగ్ మృతి

బీహార్ నేతల్లో మరో విషాదం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రమంత్రి బీజేపీ నేత వినోద్ కూమార్ సింగ్ కన్నుమూశారు.

బీహార్ మంత్రి వినోద్ కుమర్ సింగ్ మృతి
Balaraju Goud
|

Updated on: Oct 12, 2020 | 5:30 PM

Share

బీహార్ నేతల్లో మరో విషాదం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రమంత్రి బీజేపీ నేత వినోద్ కూమార్ సింగ్ కన్నుమూశారు. బీహార్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత వినోద్ కుమార్ సింగ్ (54) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని మెదంత ఆసుపత్రితో చేరారు. ఆయన.. చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందగా, తాజాగా మరో బీసీ నేత మరణం రాజకీయ నేతల్లో తీవ్ర కలవరాన్ని గురిచేసింది.

జూన్‌లో వినోద్ కుమార్‌తో పాటు ఆయన భార్యకూ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే, కొద్ది రోజులపాటు చికిత్స పొందిన ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. అనంతరం నెలన్నర తర్వాత మళ్లి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. చివరికి సోమవారం వినోద్ కుమార్ తుది శ్వాసవిడిచారు.

1995లో వినోద్ కుమార్ రాజకీయల్లోకి ప్రవేశించి 29 వ ఏటనే ప్రాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2000 ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి మహేంద్ర నారాయణ్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2005లోనూ ఓటమి పాలయినప్పటికీ 2010, 2015 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2015 ఆర్జేడీ-జేడీయూ కూటమిని తట్టుకుని సైతం వినోద్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆయనకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పదవి వరించింది. కాగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాన్‌పూర్ నుంచి ఆయన భార్య నిషా సింగ్‌ను ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.