emotional tweet: ‘దీదీ లేకుండా బతకలేను,….బీజేపీలో చేరి తప్పు చేశా..’ మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనాలి గుహ ఆవేదన
బెంగాల్ లో కనీవినీ ఎరుగని విచిత్రం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ తప్పు చేశానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెంగాల్ లో కనీవినీ ఎరుగని విచిత్రం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ తప్పు చేశానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ నేతృత్వం లోని టీఎంసీని వదిలి బీజేపీలో చేరినందుకు క్షమాపణ చెబుతున్నానని, మళ్ళీ మీ పార్టీలోకి చేర్చుకోవాలని సీఎం మమతా బెనర్జీకి ఆమె లేఖ రాశారు. దాన్ని ట్విటర్ లో కూడా షేర్ చేశారు. నేను చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఈ పార్టీ లో (బీజేపీలో) ఇమడలేకపోతున్నాను..నీరు లేనిది చేప ఎలా బతకాజాలదో ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని వదిలి బతకలేక పోతున్నా..దీదీ! నన్ను మళ్ళీ టీఎంసీ లోకి తీసుకోండి..మీరు నన్ను క్షమించకపోతే బతకలేను..’నా మిగతా జీవితమంతా మీ అభిమానంతో గడిపే అవకాశం ఇవ్వండి..’అంటూ ‘ ఆమె ఎంతో భావోద్వేగంగా లేఖ రాశారు.మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా అయిన సోనాలి గుహ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. . ఒకప్పుడు మమతా బెనర్జీకి ‘షాడో’ గా కొనసాగారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. బీజేపీ బలోపేతం కోసం శ్రమిస్తానన్న ఆమె తాజాగా..ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీలో తనను ‘అక్కరలేనిదానిగా’ చూస్తున్నారని, మమతను తిట్టాలని, విమర్శించాలని కోరుతున్నారని, కానీ తాను అలా చేయలేనని ఆమె చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ లో మళ్ళీ చేరేందుకు రేపో, మాపో మమతా బెనర్జీని కలుస్తానని సోనాలి గుహ వెల్లడించారు. కాగా -మమత మళ్ళీ బెంగాల్ సీఎం అయ్యారు గనుక ఈమె ఇలా తన ‘ప్లేటు ఫిరాయించినట్టు’ కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఎంసి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేనందుకు అలిగి ఆమె ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid-19 Vaccine: వ్యాక్సిన్ వేసుకున్న ఫొటో పంపండి.. 5 వేలు గెలుచుకోండి..! ( వీడియో )
Gold And Silver Price: బంగారం ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు…; ( వీడియో )