సడెన్‌గా సెలవుల్లోకి నిమ్మగడ్డ.. జరగబోయేది తలచుకుని లబోదబోమంటున్న ఆ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బిజీ..
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బిజీ అయ్యారు. అయితే ఆయన సడన్ గా సెలవు పెట్టడం సంచలనంగా మారింది. ఈనెల 16నుంచి 21వరకు సెలవులోకి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ కు టూర్ వేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్‌ఈఎసీ నిమ్మగడ్ద రమేశ్ కుమార్ మధ్య వైరం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అభ్యంతరాల మధ్య పట్టుదలతో ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకున్నారు నిమ్మగడ్డ. ఇక పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపల్ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేసి తాను తగ్గేది లేదని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేనట్టేననే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 31న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కాబోతున్నారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లినట్లేనని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. గతేడాది మార్చిలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఏడాది కాలంగా ఎన్నికల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న ఆశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఏడాది కాలంగా ప్రజల్లో ఉండటానికి అభ్యర్థులు భారీగానే డబ్బు ఖర్చు చేశారు. కరోనా .. లాక్ డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలు పేరుతో పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. వివిధ కార్యక్రమాలతో ఏడాది కాలంగా ఇదే తంతు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రిటైర్డ్ కానుండటంతో అభ్యర్థులకు మింగుడుపడని అంశంగా మారింది.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు లబో దిబోమంటోన్నారు. ప్రజల్లోనే ఉండటానికి ఏడాది కాలంగా స్థాయికి మించి ఖర్చు చేశామంటోన్న కొందరు క్యాండిడేట్స్..జరగబోయే తంతును చూసి నిరాశ చెందుతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.
Read More:
వాటిని అమలు చేస్తే విశాఖ స్టీల్‌కు మళ్లీ పూర్వవైభవం.. ప్రధాని మోదీకి లేఖలో వివరించిన సీబీఐ మాజీ జేడీ