Kodali Nani: ఏంటి విషయమని అడుగుదామని ఫోన్ చేస్తే. దేవినేని ఉమ ఫోన్ ఎత్తడు.. నెంబర్ బ్లాక్ చేస్తాడు: మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. "పగటి వేషగాడు చంద్రబాబు డ్వాక్రా గ్రూపులను కనిపెట్టింది నేనని సొల్లు..
Kodali Nani – Devineni Uma: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. “పగటి వేషగాడు చంద్రబాబు డ్వాక్రా గ్రూపులను కనిపెట్టింది నేనని సొల్లు చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాలు తెచ్చింది ప్రధాని పివి నరసింహారావు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన గజ మోసగాడు చంద్రబాబు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. మళ్ళీ అధికారంలోకి రావాలని రాజకీయ నిరుద్యోగులు కొందరు పర్యటనలు చేస్తున్నారు.” అని మంత్రి ఘాటుగా విమర్శించారు.
వైసీపీ నేతలు, మంత్రులు, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న కొడాలి నాని.. మాట్లాదామని దేవినేని ఉమకి ఫోన్ చేస్తే.. ఫోన్ ఎత్తడు.. నెంబర్ బ్లాక్ చేస్తాడు. అంటూ చెప్పుకొచ్చారు. “దేవినేని ఉమ జిల్లాలో తిరిగి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దేవినేని ఉమ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి అధికారం శాశ్వతం కాదని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకోసారి అధికారులను బెదిరిస్తే కేసులు పెట్టండి.” అని కొడాలి ఉద్యోగులకు సలహా ఇచ్చారు.
“వసంత కృష్ణ ప్రసాద్ గ్రావెల్, కంకర అమ్ముకున్నాడని దేవినేని ఉమ మాట్లాడుతున్నాడు.. ఆ పనులు చేసేది దేవినేని ఉమ. తలసిల రఘురాం.. ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్, ముఖ్యమంత్రి కూడా అతనే .. ముఖ్యమంత్రికి మాపై ఏమి చెబుతాడో అని మేము అతనికి భయ పడతాము. అతని చెప్పిన పనులు మేము చేస్తున్నాము. పులివెందుల, కుప్పం, బెజవాడ అయినా వైసీపీ జెండా ఎగురుతుంది. రఘురాం శాసిస్తే మేము పాటిస్తాము.” అంటూ మంత్రి ఇవాళ గొల్లపూడిలో చెప్పుకొచ్చారు.
Read also: Kerala Floods: కేరళకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తాం: కేంద్రమంత్రి అమిత్‌షా