Kerala Floods: కేరళకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నాం: కేంద్రమంత్రి అమిత్‌షా
కుండపోత వానలకు కకావికలమవుతోంది కేరళ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లాడిపోతోంది. పట్టణాలు, నగరాలు చెరువుల్లా మారాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి.

Kerala Floods – Amit Shah: కుండపోత వానలకు కకావికలమవుతోంది కేరళ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లాడిపోతోంది. పట్టణాలు, నగరాలు చెరువుల్లా మారాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. మల్లపురం, కోజికోడ్, వయనాడ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడి 26 మంది గల్లంతయ్యారు.
ఇడుక్కిలో నిన్న సాయంత్రం 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిజోరు వానకు ఉప్పొంగిన వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. వరద ప్రవాహానికి 15మంది గల్లంతయ్యారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు అధికారులు.
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది NDRF.
కుండపోత వానలతో కకావికలమవుతున్న కేరళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు కేంద్రమంత్రి అమిత్‌షా. సహాయక చర్యల కోసం NDRF సిబ్బందిని పంపించినట్టు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాఫ్టర్లను కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు.
We are continuously monitoring the situation in parts of Kerala in the wake of heavy rainfall and flooding. The central govt will provide all possible support to help people in need. NDRF teams have already been sent to assist the rescue operations. Praying for everyone’s safety.
— Amit Shah (@AmitShah) October 17, 2021
రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలతో కేరళ సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలోని వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్ సమీక్ష నిర్వహించారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.పతనంతిట్ట, కొట్టాయం, తిరువనంతపురం జిల్లాల్లో డ్యామ్‌లకు వరద మరింత పెరిగే ప్రమాదముందని..నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సీఎం పినరయి విజయన్. ముంపు గ్రామాల ప్రజలు పునరావాస శిబిరాలకు తరలివెళ్లాలని సూచించారు.
#KeralaRains UPDATE 17/10/21 ?@NDRF @ WORK 24×7 ?Evacuating Citizens to safety ?Rescue operation by @04NDRF ?In & around ERNAKULAM ?Rescued 33 (M-18,F-8,Ch – 07). ?Ops ON@HMOIndia @BhallaAjay26 @PIBHomeAffairs @PIBTvpm @ANI @PTI_News @DDNewslive pic.twitter.com/SDNLy7Yu9Y
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ୟ ପ୍ରଧାନ (@satyaprad1) October 17, 2021
Read also: Sasikala: జయలలిత సమాధి వద్ద శశికళ భావోద్వేగం.. అమ్మను తలచుకుంటూ కంట తడిపెట్టిన చిన్నమ్మ