Sasikala: జయలలిత సమాధి వద్ద శశికళ భావోద్వేగం.. అమ్మను తలచుకుంటూ కంట తడిపెట్టిన చిన్నమ్మ

మళ్లీ వస్తా..తప్పకుండా ఎంట్రీ ఇస్తా..కమింగ్‌ సూన్‌ అంటూ ప్రకటన చేసిన చిన్నమ్మ..అన్నట్టుగానే వచ్చేశారు. ఒక్కరు..ఇద్దరు కాదు..వేలాది మందితో భారీ ర్యాలీగా తరలివచ్చారు. జయ మెమోరియల్‌కు చేరుకొని..అమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు.

Sasikala: జయలలిత సమాధి వద్ద శశికళ భావోద్వేగం.. అమ్మను తలచుకుంటూ కంట తడిపెట్టిన చిన్నమ్మ
Shashikala

Sasikala: మళ్లీ వస్తా..తప్పకుండా ఎంట్రీ ఇస్తా..కమింగ్‌ సూన్‌ అంటూ ప్రకటన చేసిన చిన్నమ్మ..అన్నట్టుగానే వచ్చేశారు. ఒక్కరు..ఇద్దరు కాదు..వేలాది మందితో భారీ ర్యాలీగా తరలివచ్చారు. జయ మెమోరియల్‌కు చేరుకొని..అమ్మ సమాధి వద్ద నివాళులర్పించారు. కొద్దిసేపు భావోద్వేగానికి గురైన శశికళ..కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మకు పుష్పాంజలి ఘటించారు. అన్నాడీఎంకే శశికళ ఉపయోగించడం చట్ట రీత్యా నేరం అంటోంది ఆ పార్టీ. శశికళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.

Jayalalitha

నాలుగేళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన శశికళ..బెంగళూరు జైలుకు వెళ్తూ అమ్మ సమాధి వద్ద శపథం చేసి మరీ వెళ్లారు. మూడుసార్లు జయ సమాధిపై గుద్ది తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని వెళ్లారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక జయలలిత సమాధి వ్దద నివాళులర్పించుకున్నా అందుకు అంగీకరించలేదు అప్పటి పళని ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. స్టాలిన్‌ సర్కార్‌ కొలువుదీరింది. ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసి మరీ అనుకున్నది చేశారు.

Sasikala 2

ఎస్‌..శశికళ ఎంట్రీ తమిళ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల వేళ..భారీ ర్యాలీగా తరలిరావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. శశికళ రీ ఎంట్రీతో అన్నాడీఎంకేలో చీలిక తప్పదా..? అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Sashikala

నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత విడుదలైన చిన్నమ్మ ఓ వారం పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి బయటికొచ్చే సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో ప్రయాణించారు. మళ్లీ ఇప్పుడు కూడా అమ్మ సమాధి వద్దకు అన్నాడీఎంకే జెండా ఉన్న కారులోనే ప్రయాణించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu