Somu Veerraju: బ్రహ్మంగారి కాలజ్ఞానం కాలరాసేవారు రాజ్యమేలుతున్నారు: సోమువీర్రాజు
వైసీపీకి దమ్ముంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అంటూ ఏపీ సర్కారుకి సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు . బద్వేలు బస్తీ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెబితే
Badvel By Election – BJP: వైసీపీకి దమ్ముంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అంటూ ఏపీ సర్కారుకి సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు . బద్వేలు బస్తీ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెబితే, కనీసం బద్వేలుకు పంట కాలవలు కూడా నిర్మాణం కాలేదని ఆయన అన్నారు. బ్రహ్మంసాగర్‌కు అనుబంధంగా కాలవల నిర్మాణం జరగలేదన్న సోము.. బ్రహ్మంగారి కాలజ్ఞానం కాలరాసేవారు ఇప్పుడ ఆంధ్రప్రదేశ్ రాజ్యమేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని బద్వేలు ప్రజలు గుర్తించారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
పులివెందులకు బద్వేలుకు మధ్య అభివృద్ధిలోని వ్యత్యాసాన్ని బద్వేలు ప్రజలేకాదు, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. బద్వేలుకు ఏమైనా మంచి జరిగిందంటే, అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే అభివృద్ధి సాగిందని ఆయన చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ కరెంటు కోతలు మాదిరిగా సంక్షేమ పధకాలకు కోతలు విధిస్తోంది.. అందుకే అమ్మవడికి అటెండెన్స్ లింక్ పెట్టిందని సోము వీర్రాజు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం దగ్గర నుండి రేషన్ బియ్యం వరకూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని ఈ విషయాన్ని వైసీపీ సర్కారు ప్రజలకు తెలియకుండా చేస్తోందని సోము స్పష్టం చేశారు.
Read also: TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం ఎల్పీ మీటింగ్