Andhra Pradesh: వాహనాలకు ఫేక్ స్టిక్కర్లు వేస్తున్నారా..? అయితే మీరు బుక్ అయినట్లే
పోలీస్ డిపార్ట్‌మెంట్ కాదు. మీడియాలో పనిచేయడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాదు.. కానీ వీఐపీలు, వీవీఐపీల్లా వాహనాలకు నకిలీ స్టిక్కర్లు అతికించుకుని రోడ్లపైకి వచ్చి పోలీసులకు మస్కా కొట్టేస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెస్, పోలీస్ అంటూ స్టిక్కర్లు వేసుకుని విశాఖలో బొచ్చెడు వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఏ మాత్రం అర్హత, సంబంధం లేకపోయినా.. ఇష్టారీతిన స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. వాహనాలపై స్టిక్కర్లు అతికించుకుని అనధికారికంగా చెలామణి అయిపోతున్నారు. వీఐపీలు, ఆన్ డ్యూటీ ఎంప్లాయిస్ అనుకుని పోలీసులు కూడా ఇన్ని రోజులు చూసీచూడకండా వదిలేస్తున్నారు. అదే వారికి కలిసొస్తోంది. అయితే ఈ మధ్య ఇటువంటి వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు.. కొన్ని సందర్భాల్లో నేరాలకూ ఆస్కారముంటొంది. ఈ క్రమంలోనే ఇటువంటి వాహనాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది పోలీస్ డిపార్ట్ మెంట్. విశాఖ నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. వాహనాలను ఆపి.. అనధికారికంగా వేసుకున్న స్టిక్కర్లను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు 89 ఎమ్మెల్యే, 29 ఎంపీ, 9 ఎమ్మెల్సీ పేరుతో స్టిక్కర్ల వాహనాలు అనధికారికంగా తిరుగుతున్నట్టు తేలింది. ప్రెస్, పోలీస్ పేరుతో అనధికారికంగా తిరిగేళ్లూ చాలా మందే ఉన్నారు. సిటీ వ్యాప్తంగా 249 పోలీస్, 319 ప్రెస్, 80 డిఫెన్స్, ఆర్టీఓ, పేర్లతో స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇవి కేవలం గత నెల పదో తేదీ నుంచి 22 వరకు పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు మాత్రమే.
పోలీసులు ప్రశ్నించేసరికి పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పోలీసులకు మస్కా కొట్టే వాహనాలపై దృష్టిసారించారు ట్రాఫిక్ పోలీసులు. తొలుత కౌన్సెలింగ్ ఇచ్చి స్టిక్కర్లు తొలగించి వదిలేస్తున్నారు. ఇంకో సారి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. పదేపదే స్టిక్కర్లతో అనధికారికంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు.
Also Read: లేటైనా కాస్త ఘాటుగా… ‘మా’ పరిణామాలపై ఆర్జీవీ సంచలన ట్వీట్
‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ