Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USS Carl Vinson: విశాఖపట్నం తీరానికి వచ్చిన భారీ యుద్ధనౌక.. అందులో ఎవరి డెడ్ బాడీని తీసుకెళ్లారంటే..

ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖపట్నం తీరన అమెరికా, ఇండియా యుద్ద నౌకలతో బంగాళాఖాతంలో మలబార్‌ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇందులో అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విమాన వాహక అణు యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌ (సీవీఎన్‌-70) ఉంది...

USS Carl Vinson: విశాఖపట్నం తీరానికి వచ్చిన భారీ యుద్ధనౌక.. అందులో ఎవరి డెడ్ బాడీని తీసుకెళ్లారంటే..
Ship
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 16, 2021 | 7:49 PM

ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖపట్నం తీరన అమెరికా, ఇండియా యుద్ద నౌకలతో బంగాళాఖాతంలో మలబార్‌ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇందులో అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విమాన వాహక అణు యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌ (సీవీఎన్‌-70) ఉంది. ఇదే నౌకలో బిన్ లాడెన్ డెడ్ బాడీని సముద్రంలో బరియల్ చేయడానికి తీసుకెళ్లారు. యుద్ధవిన్యాసాల్లో అత్యంత ఖరీదైన విమాన వాహక యుద్ధనౌకలను వినియోగించడం చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ కేంద్రంగా త్వరలో భారత్‌కు చెందిన విమాన వాహక యుద్ధనౌక విక్రాంత్‌ను మోహరించనున్న నేపథ్యంలో తాజా విన్యాసాల్లో అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ కార్ల్‌విన్సన్‌ వచ్చింది.

యూఎస్‌ఎస్‌ కార్ల్‌విన్సన్‌ యుద్ధనౌకకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అమెరికా నౌకాదళంలో యూఎస్‌ఎస్‌ కార్ల్‌విన్సన్‌ విమాన వాహక యుద్ధనౌకను 1980లో ప్రవేశపెట్టారు. జార్జియాకు చెందిన ప్రముఖ నాయకుడు కార్ల్‌ విన్సన్‌ యూఎస్‌ నౌకాదళానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నౌకకు ఆయన పేరును పెట్టారు. 1983 నుంచి ఈ యుద్ధ నౌక సేవలందిస్తోంది. సాధారణ విమాన వాహక యుద్ధనౌకలతో పోలిస్తే దీని పరిమాణం భారీగానే ఉంది.

దీనిపై నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. యుద్ధనౌక లక్ష్యంగా వచ్చే క్షిపణులను, టోర్నడోలను క్షణాల్లో గుర్తించగలిగే అధునాతన వ్యవస్థలన్నీ ఇందులో ఉన్నాయి. శత్రుదేశాలపై ఒక్కసారిగా దాడి చేయడానికి వీలుగా దీనిపై అధునాతన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. విమానాలు ఎగరడానికి రన్ వే కూడా ఉంది. ఈ నౌక ఇరాక్‌ యుద్ధంతోపాటు ‘డిసర్ట్‌ స్ట్రైక్‌’, ‘సదరన్‌ వాచ్‌’, ‘ఎండ్యూరింగ్‌ ఫ్రీడం’ తదితర ఆపరేషన్లలో కీలకపాత్ర పోషించింది.

Read Also.. Andhra Pradesh: నిద్రిస్తోన్న భర్త మర్మాంగంపై సల సలా కాగుతోన్న వేడినీళ్లు పోసిన భార్య…