AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala: రాంగోపాల్‌ వర‍్మకు చెప్పండి.. చంద్రబాబు, లోకేష్‌లకు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా

రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని విషతుల్యం చేయాలని చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నాలు చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Sajjala: రాంగోపాల్‌ వర‍్మకు చెప్పండి.. చంద్రబాబు, లోకేష్‌లకు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా
Sajjala On Lokesh And Babu
Venkata Narayana
|

Updated on: Oct 06, 2021 | 1:03 PM

Share

Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని విషతుల్యం చేయాలని చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నాలు చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ఇవాళ అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. “దీనిపై చట్టపరంగా ప్రొసీడ్‌ అవడానికి సిద్ధం అవుతున్నాం. మీరు చెబుతున్న మాటల్లో నిజాయితీ లేదు, వాస్తవం ఏమాత్రం లేదనేది మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేని వ్యవహారాల మీద ప్రజలను మిస్‌లీడ్‌ చేయడానికి ఆరోపణలు చేస్తున్నారు. గంజాయి సాగును నేలమట్టం చేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించాల్సింది పోయి.. హెరాయిన్‌కు గంజాయికి లింక్‌పెట్టి అల్లుతున్న కథను సినిమా కథకు ఏమైనా రాంగోపాల్‌ వర‍్మకు ఇస్తే పనికి వస్తుంది.” అని సజ్జల ఎద్దేవా చేశారు.

ఇలాంటి తప్పుడు ఆరోపణలు దయచేసి పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని సజ్జల చెప్పరాు. గతంలో ఉన్న అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందన్న సజ్జల.. టీడీపీ చేస్తున్న ఆరోపణలు షాకింగ్‌కు గురి చేస్తున్నాయన్నారు. “వీటిపై మేము ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ప్రజల డబ్బులతో రాజకీయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయనకు తెలుసు కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేయగలుగుతున్నాడు. జనంలో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేయడమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశం.” అని సజ్జల వ్యాఖ్యానించారు.

గంజాయికి సంబంధించినంత వరకూ.. ఏపీ అడ్డాగా మారిందని టీడీపీ విమర్శలు చేయడం చూస్తే.. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని సజ్జల అన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో చాలా ఫోకస్‌గా పని చేస్తోందని.. మావోయిస్టుల ప్రాభవం ఉన్న ప్రాంతాలైన ఏవోబీలో గంజాయి పట్టుబడినట్లు వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గంజాయి రవాణాకు కళ్లెం వేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టారని సజ్జల వెల్లడించారు.

Read also: Hetero: హెటిరో డ్రగ్స్ కార్యాలయాల పై ఐటీ దాడులు.. డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు