AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hetero: హెటిరో డ్రగ్స్ కార్యాలయాల పై ఐటీ దాడులు.. డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు

హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఈ ఉదయం నుంచీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థ డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు

Hetero: హెటిరో డ్రగ్స్ కార్యాలయాల పై ఐటీ దాడులు.. డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు
Hetero
Venkata Narayana
|

Updated on: Oct 06, 2021 | 10:00 AM

Share

Hetero IT Raids: హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఈ ఉదయం నుంచీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థ డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఇన్ కం ట్యాక్స్ అధికారులు. హైదరాబాద్‌తో పాటు మూడు ప్రాంతాల్లో ఇటీ సోదాలు చేస్తున్నారు ఆదాయపన్ను శాఖ అధికారులు. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇండ్లలోనూ ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి. అయితే, దాడుల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నది ఈ సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా 20 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. హెటిరో సీఈవో కార్యాలయాల్లోనూ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, కొవిడ్​-19 మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమై ఆసుపత్రులో చేరిన రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హెటిరో సంస్థ మరో ఔషధం అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. భారత్​లో కొవిడ్​తో ఆసుపత్రుల్లో చేరిన వయోజనులకు అందించేందుకు తమ ఔషధం టొసిలిజుమాబ్ అత్యవసర వినియోగానికి డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ఆఫ్​ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు హెటిరో ఫార్మా ఇటీవల ప్రకటించింది. ఫలితంగా కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై స్టెరాయిడ్స్​ అందుకుంటున్న లేదా ఆక్సిజన్, వెంటిలేషన్​ అవసరమైన వారికి ఇచ్చేందుకు ఆసుపత్రులకు అధికారం లభించినట్లయింది.

హెటిరో టోసిరా(టొసిలిజుమాబ్) ఔషధాన్ని తమ భాగస్వామ్య సంస్థ హెటిరో హెల్త్​కేర్​ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు హెటిరో గ్రూప్​ ఛైర్మన్​డాక్టర్​ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు. హైదరాబాద్​జడ్చర్లలోని హెటిరో బయోఫార్మాలో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు పార్థసారధి రెడ్డి ప్రకటిడం విధితమే.

Read also: Modi Cabinet Ministers Assets: మోదీ కేబినెట్లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్.. ప్రధాని రూటు సెపరేటు. ఎవరెవరి ఆస్తులు ఎంతెంత పెరిగాయంటే.?

Follow Us
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఒమాన్ తీరంలో మరో నౌకపై దాడి..
ఒమాన్ తీరంలో మరో నౌకపై దాడి..