విడుదలైన కొన్ని గంటల లోపే.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు

జైలు నుంచి విడుదలై ఇంటికి కూడా చేరుకోకముందే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.

విడుదలైన కొన్ని గంటల లోపే.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు

Another Case against JC Prabhakar Reddy:  జైలు నుంచి విడుదలై ఇంటికి కూడా చేరుకోకముందే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డ జేసీపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353 సెక్షన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద వారు కేసు నమోదు చేశారు.

అయితే బెయిల్‌పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కడప నుంచి అనంతపురానికి వచ్చారు. అక్కడ శివార్లకు చేరిన తరువాత మరికొందరు అభిమానులు బైక్‌లతో ఆ ర్యాలీలో కలిశారు. ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీగా వెళ్లకూడదని.. రాత్రివేళ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కారు నుంచి కిందికి దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. పోలీసులు చెప్పే విషయాన్ని వినిపించుకోకుండా వారితో వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. జేసీపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

Read This Story Also: ఈడీ ముందుకు రియా.. సంచలన పోస్ట్‌ చేసిన సుశాంత్‌ సోదరి

Click on your DTH Provider to Add TV9 Telugu