Somu Veerraju Meets Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో వీర్రాజు మర్యాదపూర్వకంగా జనసేనానిని కలిశారు. ఈ సందర్భంగా పవన్, వీర్రాజుకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. శాలువాతో సన్మానించారు. భారతీయ జనతా పార్టీ- జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగాలని.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిశ్చయించారు.
మరోవైపు గురువారం సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని చిరు నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సోము వీర్రాజును బీజేపీ పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని సోము చెబుతున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖుల్ని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో భేటీ అయ్యారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని, మర్యాదపూర్వకంగా కలిసిన @BJP4Andhra నూతన అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. pic.twitter.com/i5uPcYPDAj
— JanaSena Party (@JanaSenaParty) August 7, 2020
Also Read : ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మనసు : గాయపడ్డ వ్యక్తికి రోడ్డుపైనే ప్రాథమిక వైద్యం